తెలుగులో తళుక్కున మెరిసి తెరమరుగైన ఈ హీరోయిన్ మీకు గుర్తుందా..?  

Telugu heroine Madhu Shalini movie offers news , Madhu Shalini, Telugu heroine, movie offers news , Tollywood, Kollywood, - Telugu Kollywood, Madhu Shalini, Movie Offers News, Telugu Heroine, Telugu Heroine Madhu Shalini Movie Offers News, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అందరివాడు అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హైదరాబాద్ బ్యూటీ మధు షాలిని గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే స్టార్ హీరో చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో కొత్త సినిమా అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

TeluguStop.com - Telugu Heroine Madhu Shalini Movie Offers News In Telugu

 దీనికితోడు ఈ అమ్మడు నటించిన చిత్రాలలో పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరు గుర్తించలేదు.

అయితే తెలుగులో మధుశాలిని నటించిన  కింగ్, గోపాల గోపాల, కితకితలు, నా ప్రాణం కంటే ఎక్కువ, పొగ  తదితర చిత్రాలలో నటించినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.

TeluguStop.com - తెలుగులో తళుక్కున మెరిసి తెరమరుగైన ఈ హీరోయిన్ మీకు గుర్తుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అయితే ఆ మధ్య తెలుగులో యంగ్ హీరో అడవి శేషు హీరోగా నటించినటువంటి “గూడచారి” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో పాటు ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది.

దీంతో తమిళ  భాషలో కూడా రెండు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మధు షాలిని తమిళంలో రేంజర్ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రానికి సంబందించిన చిత్రీకరణ పనులు తమిళనాడు లోని చెన్నై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.అయితే ఇటీవలే మధు షాలిని విచిత్రాన్ అనే చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చ్చినట్లు సమాచారం.

#TeluguHeroine #Madhu Shalini #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Heroine Madhu Shalini Movie Offers News In Telugu Related Telugu News,Photos/Pics,Images..