కీర్తి సురేష్ తల్లి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో హీరోగా నటించినటువంటి పున్నమి నాగు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రముఖ సీనియర్ నటి మేనక సురేష్ గురించి అప్పటి తరం సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే మేనక సురేష్ మాతృభాష తమిళం కావడంతో ఎక్కువగా తమిళంలోనే సినిమా అవకాశాలు దక్కించుకుంది.

 Telugu Heroine Keerthi Suresh Mother Menaka Suresh News, Keerthi Suresh, Telugu-TeluguStop.com

కానీ తెలుగులో అడపాదడపా చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకుంది.ఇప్పటికీ మేనక సురేష్ కుమార్ కూతురు తెలుగులో స్టార్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు.

అయితే ఇంతకీ ఆమె కూతురు ఎవరని అనుకుంటున్నారా.? ఆమె ఎవరో కాదు తెలుగులో ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన “నేను శైలజ” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన తమిళ బ్యూటీ కీర్తి సురేష్.ఈ అమ్మడు వచ్చి రావడంతోనే తెలుగు సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.

దాంతో వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది.

ఇందులో  ముఖ్యంగా యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి చిత్రంలో అలనాటి అందాల తార సావిత్రి పాత్రలో నటించి తన నటనా ప్రతిభని నిరూపించుకుంది.  అయితే  కీర్తి సురేష్ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నటనా ప్రతిభ, అందం, అభినయంతో ఎంతగానో ప్రేక్షకుల్ని అలరించింది.

 అందువల్లనే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందుతోంది.

Telugu Keerthi Suresh, Mahanati, Menaka Suresh, Punnami Nagu, Rang De, Telugu, T

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో కిర్తిసురెష్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన “రంగ్ దే” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ కి జోడిగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్నాడు. అయితే ఇటీవలే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన “మిస్ ఇండియా” అనే చిత్రాన్ని ఒటిటి ప్లాట్ ఫారం అయినటువంటి నెట్ ఫ్లిక్స్ లో చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

 కానీ  ఈ చిత్రంఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube