ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ గుర్తుందా…?  

Telugu Heroine Kausalya Real Life Interesting News - Telugu Jagapathi Babu, Kausalya, Panchadara Chilaka, Srikanth, Telugu Heroine, Tollywood

తెలుగు లో ప్రముఖ హీరో జగపతి బాబు హీరోగా నటించినటువంటి అల్లుడుగారు వచ్చారు అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి కన్నడ నటి కౌసల్య గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా ఈ చిత్రం అప్పట్లో ఫర్వాలేదనిపించినప్పటికీ ఆ తరువాత సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించినటువంటి పంచదార చిలక అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే గాకుండా నటి కౌసల్యకు మంచి గుర్తింపును కూడా తెచ్చింది.

 Telugu Heroine Kausalya Real Life Interesting News

కాగా నటి  కౌసల్య  తెలుగు చిత్రాల్లో నటించింది తక్కువే  అయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం తన అందం, అభినయం, నటన తో బాగానే ఆకట్టుకుంది.అయితే ప్రస్తుతం నటి కౌసల్య కి 40 సంవత్సరాలు.

దీంతో ఈ అమ్మడు పెళ్లి గురించి సోషల్ మీడియా మాధ్యమాల్లో పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇటువంటి ఓ స్టార్ హీరో తో ఈ అమ్మడు అప్పట్లో ప్రేమాయణం నడిపిందని కానీ ఆ హీరో మాత్రం ఓ బడా వ్యాపారవేత్త కూతురిని పెళ్లి చేసుకున్నాడని దాంతో కొంతకాలం పాటు నటి కౌసల్య తీవ్ర మనస్థాపానికి గురై సినీ పరిశ్రమకు దూరంగా వెళ్లిపోయిందని కొందరు చర్చించుకుంటున్నారు.

ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ గుర్తుందా…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తన బంధువులు మరియు సన్నిహితుల ద్వారా కోలుకొని మళ్లీ ఇటీవలే సినిమాల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది.

కాగా తెలుగులో ఆ మధ్య కాలంలో అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించినటువంటి రారండోయ్ వేడుక చూద్దాం, సవ్యసాచి తదితర చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

అయితే నటి కౌసల్య మలయాళం, కన్నడ,తెలుగు, తమిళం భాషలలో కలిపి దాదాపుగా 30కి పైగా చిత్రాల్లో నటించింది.ఈమె తెలుగులో నటించిన టువంటి పంచదార చిలక చిత్రం మాత్రం ఇప్పటికీ చాలామందికి తమ ఫేవరెట్ చిత్రాల లిస్టులో ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Heroine Kausalya Real Life Interesting News Related Telugu News,Photos/Pics,Images..

footer-test