ఈ హీరోయిన్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురని మీకు తెలుసా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహించిన “జోష్” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ కార్తీక నాయర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే పర్వాలేదనిపించినప్పటికీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో అవగాహన లోపించడం వల్ల తన తదుపరి చిత్రాలతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

 Radha, Karthika Nair, Telugu Veteran Actress, Tollywood, Real Life News,-TeluguStop.com

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా అవకాశాలు దక్కించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తుంది.

అయితే ఇప్పటికీ చాలా మంది సినీ ప్రేక్షకులకు తెలియని విషయం ఏంటంటే హీరోయిన్ కార్తీక ఒకప్పుడు తెలుగులో దాదాపుగా అందరి సీనియర్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సీనియర్  హీరోయిన్ రాధ కూతురు అని.అయితే సినిమాల నుంచి విరామం తీసుకున్నటువంటి రాధ ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో ఉన్న తన సొంత నివాసంలో ఉంటున్నట్లు సమాచారం.అయితే అందరి సినీ నటి నటుల లాగే నటి రాధ కూడా తన వారసత్వాన్ని సినీ పరిశ్రమలో కొనసాగించింది.

అయితే రాధా రెండవ కూతురు తులసి నాయర్ కూడా హీరోయిన్.ఈమె ఆ మధ్య కాలంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన “కడలి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరోయిన్ కార్తీక నాయర్ సినీ అవకాశాలు లేక ఇంటి వద్దనే ఖాళీగా గడుపుతున్నట్లు సమాచారం.  కాగా ఆ  మధ్య కాలంలో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన  ఓ  చిత్రం ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడుతుండడంతో ఓటిటి ప్లేట్ ఫారం లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

ఏదేమైనప్పటికీ తన తల్లి సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నట్లుగా కార్తీక నాయర్ మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube