డబ్బు కోసం వేధిస్తున్నాడని ఈ స్టార్ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ కి...  

తెలుగులో ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన “దేవదాసు” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన గోవా బ్యూటీ “ఇలియానా” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు ఒకప్పుడు సినిమా తెలుగు పరిశ్రమకి జీరో సైజ్ నడుము అంటే ఏమిటో పరిచయం చేసింది.

TeluguStop.com - Telugu Heroine Ileana Dcruz And Andrew Kneebone Love Breakup News

దీంతో వరుసగా ప్రిన్స్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా రవితేజ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుని బాగానే రాణించింది.

కానీ బాలీవుడ్ సినిమాలపై మనసు మళ్లడంతో అక్కడికి వెళ్లి తన సినీ కెరీర్ ని చేజేతులారా నాశనం చేసుకుంది.

TeluguStop.com - డబ్బు కోసం వేధిస్తున్నాడని ఈ స్టార్ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ కి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అయితే ఆ మధ్య తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ క్నీబోన్ తో లవ్ లో పడింది.దీంతో అప్పట్లో వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా చెట్టా పట్టాలేసుకుని తిరిగేవాళ్లు.ఈ క్రమంలో అందరూ తొందర్లోనే ఇలియానా ఆండ్రూ క్నీబోన్ ని పెళ్లి చేసుకోబోతుందనే  వార్తలు కూడా వినిపించాయి.కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పింది.

 ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.

అంతేగాక ఆండ్రూ  ఫోటోగ్రాఫర్ గా పని చేసేవాడని, అతడు ఎక్కువగా ఇలియానా డబ్బులు ఉపయోగించుకునే వాడని, దీంతో విచ్చలవిడి తనం ఎక్కువవడంతో ఇలియానా పలుమార్లు వారించింది.

ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగి చివరికి అతనికి ఇలియానా బ్రేకప్ చెప్పిందని కొందరు చర్చించుకుంటున్నారు.అయితే ఆండ్రూ తో బ్రేకప్ అయిన తర్వాత ఇలియానా తన సినీ కెరీర్ పై దృష్టి సారించింది.

కానీ అప్పటికే బరువు బాగానే పెరిగింది. దీంతో బరువు తగ్గేందుకు ప్రస్తుతం జిమ్ లో  బాగానే శ్రమిస్తోంది.

ప్రస్తుతం ఓ బాలీవుడ్ కి సంబంధించిన “ది బిగ్ బుల్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి నిర్మాతగా బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ వ్యవహరిస్తున్నాడు.కాగా ఇటీవలే ఇలియానా హిందీలో “అన్ ఫెయిర్ అండ్ లవ్లీ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఐతే ఈ చిత్రంలో ఇలియానా కొంతమేర డీ గ్లామరస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

#Ileana D Cruz #TeluguHeroine #IleanaLove #Andrew Kneebone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు