అందుకే ఈ అమ్మడికి అవకాశాలు రావడంలేదేమో...

తెలుగులో యంగ్ దర్శకుడు “పల్నాటి సూర్య ప్రతాప్” దర్శకత్వం వహించిన “కుమారి 21ఎఫ్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి కుర్ర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ హీరోయిన్ “హెబ్బా పటేల్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఈ చిత్రంలో “మెచ్యూర్డ్ గర్ల్” పాత్రలో తన నటనతో ఆకట్టుకోవడమేగాకుండా, వచ్చీరావడంతోనే మంచి హిట్ ని అందుకుంది.

 Telugu Heroine Hebah Patel Movie Offers Low For That Reason-TeluguStop.com

దీంతో వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.కానీ కథల విషయంలో మరియు పలు చిత్రాలలోని తన పాత్రల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.

దీంతో ఈ ప్రభావం కాస్త ఈ అమ్మడి సినిమా కెరియర్ పై పడింది.ఒకానొక సమయంలో చేతినిండా అవకాశాలతో బిజీబిజీగా గడిపిన హెబ్బా పటేల్ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక స్పెషల్ సాంగ్స్ లో నటించే స్థాయికి వచ్చేసింది.

 Telugu Heroine Hebah Patel Movie Offers Low For That Reason-అందుకే ఈ అమ్మడికి అవకాశాలు రావడంలేదేమో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే హెబ్బా పటేల్ యంగ్ హీరోలయిన టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాజ్ తరుణ్, నిఖిల్ సిద్దార్థ్, తదితర హీరోలతో కలిసి హీరోయిన్ గా నటించింది.కానీ ఈ అమ్మడి కెరియర్లో కుమారి 21ఎఫ్ చిత్రం తప్ప మిగిలిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో ఇప్పటివరకూ హెబ్బా పటేల్ కి  చెప్పుకోవటానికి సరైన హిట్ లేకపోవడంతో ప్రస్తుతం సినిమా అవకాశాల విషయంలో కొంతమేర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.దీంతో ఆ మధ్య యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన “రెడ్”, అలాగే నితిన్ హీరోగా నటించిన “భీష్మ” తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హెబ్బా పటేల్ తెలుగులో “ఓదెల రైల్వే స్టేషన్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో కేజిఎఫ్ చిత్ర ఫేమ్ నటుడు “వశిష్ట ఎన్ సింహ” నటిస్తుండగా నూతన దర్శకుడు “అశోక్ తేజ” దర్శకత్వం వహిస్తున్నాడు.

కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “సంపత్ నంది” కథను అందించాడు.అలాగే టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు “అనూప్ రూబెన్స్” సంగీతం సమకూరుస్తున్నాడు.

కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 14వ తారీఖున విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఈ చిత్రం విడుదల కొంతకాలం పాటు వాయిదా పడబోతున్నట్లు సమాచారం.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.–  తెలుగుస్టాప్.కామ్ యాజమాన్యం

.

#Hebah Patel #TeluguHeroine #HebahPatel #HebahPatel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు