లాక్ డౌన్ లో బాగానే బరువు తగ్గిన బొద్దు గుమ్మ.... 

తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “దేశ ముదురు” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “హన్సిక” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే స్టైలిష్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషలలో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

 Telugu Heroine Hansika Motwani Weight Loss For Movie Offers-TeluguStop.com

దీంతో ఈ అమ్మడు తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎనర్జిటిక్ హీరో రామ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహారాజా రవితేజ తదితర స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను అలరించింది.అయితే ఒకప్పుడు బొద్దుగా చాలా ముద్దుగా కనిపించే హన్సిక ఈ మధ్య సినిమా అవకాశాల కోసం బాగానే బరువు తగినట్లు తెలుస్తోంది.

కాగా ఈ మధ్య హన్సిక మొత్వాని సోషల్ మీడియాలో బాగానే ఆక్టివ్ గా ఉంటోంది.ఇందులో భాగంగా అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన మరియు ఫోటోలను వీడియోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

 Telugu Heroine Hansika Motwani Weight Loss For Movie Offers-లాక్ డౌన్ లో బాగానే బరువు తగ్గిన బొద్దు గుమ్మ…. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రస్తుతం హన్సిక ఫోటోలను ఒకసారి చూసినట్లయితే దాదాపుగా 10 నుంచి 15 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది.ఇందుకోసం ఈ అమ్మడు ప్రత్యేకంగా ఫిట్ నెస్ ట్రైనర్ ని కూడా నియమించుకుని రోజులో ఎక్కువ సమయం జిమ్ వర్క్ ఔట్లని చేయడమే కాకుండా ఆహారపు డైట్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం.

అయితే అప్పటివరకు హన్సికని బొద్దుగా చూసినటువంటి అభిమానులు ప్రస్తుతం బాగా సన్నగా బడడంతో పెద్దగా ఇష్టపడడం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా హన్సిక గత ఏడాది తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ హీరో గా నటించిన “రామకృష్ణ ఎల్.ఎల్.బి” అనే తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కానీ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.దీంతో తన తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “మహ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రం హార్రర్ థ్రిల్లర్ తరహాలో ఉండబోతున్నట్లు సమాచారం.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం

#Hansika Motwani #TeluguHeroine #HansikaMotwani #HansikaMotwani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు