తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల కు ప్రాముఖ్యత ఇవ్వరు అనే విషయము అందరికీ తెలిసిందే.
ఈషా రెబ్బా విషయం లో కూడా అదే జరిగింది.అందం తో పాటు అభినయం తో ఆకట్టుకునే ఈ అమ్మడికి ఇప్పటి వరకు తెలుగు పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కలేదు.
ప్రతిభ ఉన్నా కూడా అవకాశాలు దక్కించుకోలేక పోతుంది.తెలుగు లో చిన్న చిన్న సినిమాలు చేస్తూ మరో వైపు ఇతర భాషల వైపు కూడా చూస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫోటో లను షేర్ చేస్తూ ముంబై ముద్దుగుమ్మలకు ఏ మాత్రం తీసిపోను అంటూ చెప్పకనే చెబుతోంది.

హీరోయిన్ గా చిన్న చిన్న సినిమా లు చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియా లో మాత్రం పెద్ద హీరోయిన్ల స్థాయిలో అందాల ఆరబోత చేస్తోంది.తాజాగా ఈ అమ్మడు తన స్కిన్ ను సన్ లైట్ లో ఎక్స్ పోజింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.సన్ లైట్ లో నేచురల్ స్కిన్ ఫొటో లను షేర్ చేయడం ద్వారా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ప్రస్తుతం మలయాళం సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలోనే తెలుగు లో ఒక పెద్ద సినిమా చేయబోతున్నట్లు చెబుతూ వచ్చింది.
కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లను కూడా ఈ అమ్మడు చేస్తోంది.వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు స్టార్ హీరోయిన్లకు మోస్ట్ వాంటెడ్ అవుతుంది అనే నమ్మకం తో ఎదురు చూస్తోందట.
కచ్చితంగా ఈ అమ్మాయికి ఆ స్థాయి గుర్తింపు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.అందంతో పాటు ప్రతిభ ఉన్నా ఇలాంటి తెలుగు అమ్మాయిలను పెద్ద హీరోలు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.