ఈ హీరోయిన్ కి అప్పట్లో రోజుకి 4000 ఇచ్చేవారంట...

తెలుగులో “రాజు గారి గది” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ప్రముఖ తెలుగు బ్యూటీ “ధన్య బాలకృష్ణ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా నటించింది.

 Telugu Heroine Dhanya Balakrishna Remuneration Per Day-TeluguStop.com

కానీ ఈ అమ్మడి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరు గుర్తించ లేదు.

అయినప్పటికీ పట్టు విడువకుండా శ్రమించి సినిమా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం బాగానే రాణిస్తోంది.

 Telugu Heroine Dhanya Balakrishna Remuneration Per Day-ఈ హీరోయిన్ కి అప్పట్లో రోజుకి 4000 ఇచ్చేవారంట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇప్పటివరకు ధన్య బాలకృష్ణ కి ఎక్కువగా గ్లామర్ కి సంబంధించిన పాత్రలలో నటించే అవకాశాలు మాత్రమే వచ్చాయి.దీంతో తన నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి ఇప్పటి వరకూ సరైన అవకాశం దక్కలేదని చెప్పాలి.

అయితే ఆ మధ్య ధన్య బాలకృష్ణ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తాను సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో కూడా నటించానని అందుకుగానూ తనకు రోజుకి 4 వేల రూపాయలు పారితోషకం ఇచ్చేవారిని తెలిపింది.కానీ తను ఏమాత్రం నిరాశ చెందకుండా శ్రమించి ప్రస్తుతం లక్షల రూపాయలు పారితోషికం తీసుకునే స్టేజ్ కి వచ్చానని, ఈ క్రమంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ కూడా అవకాశాల కోసం అడ్డదారుల్లో ప్రయత్నించలేదని కూడా తెలిపింది.

ఈ అమ్మడికి హీరోయిన్ కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కాలం కలిసి రాక అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్  పాత్రలలో నటిస్తూ అలాగే చిన్న బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ అమ్మడు దాదాపుగా 15 నుంచి 25 లక్షల రూపాయలు పారితోషికం అందుకుంటుంది.

కాగా ఆ మధ్య ధన్య బాలకృష్ణ తెలుగులో బుల్లితెర పవర్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన “సాఫ్ట్ వేర్ సుధీర్” చిత్రంలో హీరోయిన్ గా నటించింది.ఈచిత్రం పర్వాలేదనిపించింది.

అలాగే గతేడాది “అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.

దీంతో కనీసం ఈ చిత్రం విడుదలైన కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు “ఫ్లిప్ ఫ్లాప్” అనే కన్నడ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.కాగా ఇటీవలే ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “20 20” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు ధన్య బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

#TeluguHeroine #FlipflopMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు