పాపం... ఈ తెలుగు హీరోయిన్ గర్భంతో ఉన్నప్పుడు అలా జరగడంతో....

తెలుగులో యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా నటించిన “సూర్యం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ “సెలీనా జైట్లీ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువ చిత్రాలలోని అయినప్పటికీ తన అందాల ఆరబోతతో తనకంటూ కొద్దిమంది అభిమానులను సంపాదించుకుంది.

 Telugu Heroine Celina Jaitley Facing Problems At Her Pregnancy Time-TeluguStop.com

కాగా తాజాగా సెలీనా జైట్లీ ఓ ప్రముఖ పత్రికా ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న విషాదకర సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా తన భర్త పీటర్ హాగ్ ను 2011 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తెలిపింది.

 Telugu Heroine Celina Jaitley Facing Problems At Her Pregnancy Time-పాపం… ఈ తెలుగు హీరోయిన్ గర్భంతో ఉన్నప్పుడు అలా జరగడంతో….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా తాను గర్భం దాల్చిన సమయంలో తన తల్లి మరణించిందని, దాంతో ఒక్కసారిగా తాను చాలా మానసికంగా కుంగిపోయానని అదే సమయంలో తనకు జన్మనిచ్చిన టువంటి కవలలోని ఒక బిడ్డ మరణించిందని మరో శిశువు దాదాపుగా మూడు నెలలపాటు ఆస్పత్రిలోని ఐసోలేషన్ లో ఉన్నాడని దాంతో తాను నడవలేని పరిస్థితి కి చేరుకున్నానని చెప్పుకొచ్చింది.అలాగే దురదృష్టవశాత్తు అదే సమయంలో తన తండ్రి కూడా మరణించడంతో బాగా ఇబ్బంది పడ్డానని తెలిపింది.

ఆ సమయంలో తన భర్త అండదండలు అందించి తన చాలా బాగా చూసుకున్నాడని అందువల్లనే తాను మళ్లీ మామూలు స్థితికి రాగలిగానని చెప్పుకొచ్చింది.అయితే ఒక మహిళ జీవితంలో మాతృత్వం ఎంత ముఖ్యమైనదో అప్పుడే తాను తెలుసుకున్నానని కూడా ఎమోషనల్ అయ్యింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా 2011 సంవత్సరంలో పీటర్ హాగ్ తో పెళ్లయినప్పటి నుంచి “సెలీనా జైట్లీ” సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది.కాగా పెళ్లయినా దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తర్వాత “సీజన్స్ గ్రీటింగ్స్” అనే షార్ట్ ఫిలింలో 2020 సంవత్సరం లో నటించింది.

కాగా ఈ షార్ట్ ఫిలిం ప్రముఖ ఓటీటీ అయిన జీ 5 లో ప్రసారమవుతోంది.

#TeluguHeroine #Manchu Vishnu #Celina Jaitley #CelinaJaitley

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు