ఈ హీరోయిన్ స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చినా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది....

తెలుగులో ప్రముఖ దర్శకుడు జి.నీలకంఠ రెడ్డి దర్శకత్వం వహించిన “చమ్మక్ చల్లో” అనే చిత్రం ద్వారా  తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ కేథరిన్ తెరిసా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Telugu Heroine Catherine Tresa Movie Offers News, Catherine Tresa, Telugu Heroin-TeluguStop.com

అయితే ఈ అమ్మడు వరుణ్ సందేశ్ తో నటించి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన తదుపరి చిత్రం ఇద్దరమ్మాయిలతో  చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఈ క్రమంలో మొదట్లో వరుస అవకాశాలు దక్కించుకొని బాగానే రాణించినటువంటి ఈ బ్యూటీ క్రమక్రమంగా తన తదుపరి చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో బాక్సాఫీస్ వద్ద ప్లాప్ లను ఎదుర్కొని హీరోయిన్ గా అవకాశాలు  దక్కించుకోలేక పోయింది.

దీనికితోడు ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఎక్కువగా రెండవ హీరోయిన్ మరియు గెస్ట్ అప్పియరెన్స్ వంటి పాత్రలలో నటించింది. దీంతో ఈ అమ్మడికంటూ చెప్పుకోవటానికి సరైన హిట్ లేక గుర్తింపుకి నోచుకోలేదు. కాగా కేథరిన్ తెరిసా హీరోయిన్ గానే కాకుండా పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది.చక్కని ముఖ కవళికలు ,అందం, అభినయం నటన ప్రతిభ ఉన్నటువంటి తాను నటించిన చిత్రాలలోని  పాత్రల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడమే ఆమె కెరియర్ కి మైనస్ అయ్యిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది ఆరంభంలో ఈ అమ్మడు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించినటువంటి “వరల్డ్ ఫేమస్ లవర్” అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడిని ఎవరూ గుర్తించలేదు.

కాగా ఇటీవలే కేథరిన్ తెరిసాఓ కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం లోకేథరిన్ తెరిసాకొంతమేర బోల్డ్ తరహాలో కనిపిస్తుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube