తెలుగమ్మాయి హాట్ లుక్స్ తో ఎరవేస్తుంది

తెలుగు అమ్మాయిలకి తెలుగు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు తక్కువగా వస్తూ ఉంటాయి.ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు విషయంలో ఈ విషయం రుజువు అయ్యింది.

 Telugu Heroine Bindu Madhavi Look Viral, Tollywood, Kollywood, South Heroines, T-TeluguStop.com

తెలుగు అమ్మాయిలని అసలు హీరోయిన్ గా తీసుకోవడానికి దర్శకులు ఆసక్తి చూపించారని మన భామలు అంటూ ఉంటారు.అయితే మా సినిమాలలో పాత్రలకి సరిపోయే విధంగా ఉంటే తెలుగమ్మాయిలని కచ్చితంగా తీసుకుంటామని దర్శక, నిర్మాతలు అంటూ ఉంటారు.

అయితే అసలు సమస్య ఎక్కడ ఉందో అనేది అర్ధం కాదు.అయితే టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకి పెద్దగా అవకాశాలు రాకున్న కోలీవుడ్ లో మాత్రం పుష్కలంగా అవకాశాలు దొరుకుతాయి.

అక్కడ స్టార్ హీరోయిన్లుగా కూడా వారు హవా కొనసాగిస్తూ ఉంటారు.అలా కోలీవుడ్ లో సక్సెస్ అయినా హీరోయిన్లు తీసుకుంటే అంజలి, శ్రీదివ్య, ఐశ్వర్య రాజేష్, ఆనంది, బిందు మాధవి కనిపిస్తారు.

వీళ్ళందరూ కోలీవుడ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు.

Telugu Bindu Madhavi, Kollywood, Tollywood-Movie

అయితే ఈ మధ్య కాలంలో తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ డోస్ పెంచుతూ ఉండటంతో వారికి ప్రాధాన్యత పెరుగుతుంది.అలాగే దర్శకులు కూడా నేటివిటీ కోసం తమ సినిమాల కోసం తెలుగు అమ్మాయిలకి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ నేపధ్యంలో చాందిని చౌదరీ, రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్, అంజలి కొంత వరకు టాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.

జాంబీ రెడ్డితో ఆనందితో కూడా టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి వెంటనే సుధీర్ బాబుతో జత కట్టే అవకాశం సొంతం చేసుకుంది.ఈ నేపధ్యంలో ఆవకాయ బిర్యాని, బంపర్ ఆఫర్ సినిమాలతో ప్రేక్షకులకి చేరువ అయిన బిందు మాధవి మళ్ళీ టాలీవుడ్ మీద ఫోకస్ పెడుతుంది.

తమిళంలో ప్రస్తుతం ఆమె మూడు సినిమాలు చేస్తుంది.అయినా మళ్ళీ తెలుగు దర్శకులని ఎట్రాక్ట్ చేయడం కోసం హాట్ ఫోటో షూట్ లతో ఎరవేస్తుంది.మరి బిందు మాదవికి ఎంత మంది దర్శకులు కనెక్ట్ అవుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube