టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు.అయితే నటి అనుష్క మొదటగా టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన “సూపర్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత వరుసగా అందరి స్టార్ హీరోల సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఆ మధ్య దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంలో దేవసేన పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
ఏమైందో ఏమో కానీ బాహుబలి చిత్రంలో నటించిన తర్వాత అనుష్క సినిమాల పరంగా కొంత మేర జోరుని తగ్గించింది.అయితే 2015 సంవత్సరంలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన సైజ్ జీరో చిత్రం కోసం బరువు బాగానే పెరిగింది.
దీంతో అప్పటి నుంచి అనుష్క కొంతమేర బరువు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కొందరు చర్చించుకుంటున్నారు.అంతేగాక ఈ సైజ్ జీరో సినిమాలో నటించిన అనంతరం మళ్ళీ అనుష్క బరువు తగ్గింది.
బాహుబలి చిత్రంలో హీరోయిన్ గా నటించిన తరువాత భాగమతి చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం కొద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
దీనికి తోడు ఈ మధ్య కాలంలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన “నిశ్శబ్దం” చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా అలరించలేక పోయింది.దీంతో అనుష్క శెట్టి కి టాలీవుడ్ లో కొంతమేర సినిమా మార్కెట్ పడిపోయిందని సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా అనుష్క శెట్టి ఇటీవలే మెయిన్ లీడ్ పాత్రలో నటించిన “నిశ్శబ్దం” చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అవడంతో తన తదుపరి చిత్రం కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.కాగా ప్రస్తుతం ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ లో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ చిత్రంలో జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.