పెళ్లయిన తర్వాత ఈ బ్యూటీ కి సినిమా ఆఫర్లు బాగానే వరిస్తున్నాయిగా...

తెలుగులో ప్రముఖ దర్శకుడు “మారుతి” దర్శకత్వం వహించిన “బస్ స్టాప్” చిత్రంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతూ మోసపోయిన యువతి పాత్రలో నటించి మంచి మెసేజ్ ఇచ్చినటువంటి తెలుగు యంగ్ హీరోయిన్ “ఆనంది” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఆనంది మొదటగా “ఈ రోజుల్లో” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి నటిగా పరిచయమైంది.

 Telugu Heroine Anandi Bagged Huge Offers After Marriage-TeluguStop.com

ఆ తర్వాత ప్రియతమా నీవచట కుశలమా, నాయక్, గ్రీన్ సిగ్నల్, తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

కానీ ఈ చిత్రాలు ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు.

 Telugu Heroine Anandi Bagged Huge Offers After Marriage-పెళ్లయిన తర్వాత ఈ బ్యూటీ కి సినిమా ఆఫర్లు బాగానే వరిస్తున్నాయిగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కొంత కాలం పాటు టాలీవుడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమిళ సినిమా పరిశ్రమకి వెళ్ళిపోయింది.అయితే ఈ అమ్మడికి టాలీవుడ్ పెద్దగా కలిసి రాకపోయినప్పటికీ కోలీవుడ్ మాత్రం బాగానే కలిసొచ్చింది.

ఈ క్రమంలో వరుసగా హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించింది.ఇటీవలే ఆనంది “సోక్రటీస్” అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీరి పెళ్లి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పరిసర ప్రాంతంలో చాలా ఘనంగా జరిగింది.

అయితే ఇటీవలే యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన “జాంబీ రెడ్డి” చిత్రంలో ఆనంది కీలక పాత్రలో నటించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి ప్రస్తుతం సినిమా అవకాశాలు బాగానే క్యూ కడుతున్నాయి.కాగా ప్రస్తుతం ఆనంది తెలుగులో యంగ్ హీరో “సుధీర్ బాబు” హీరోగా నటిస్తున్న “శ్రీదేవి సోడా సెంటర్” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

కాగా ఇటీవలే ఈ అమ్మడి పుట్టినరోజు కావడంతో శ్రీదేవి సోడా సెంటర్ చిత్రంలో ఆనంది పాత్రకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.దీంతో ఈ టీజర్ కి మంచి స్పందన వస్తోంది.

అంతేకాక కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ పెళ్లయిన తర్వాత ఆనందికి సినిమా అవకాశాలు బాగానే క్యూ కడుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఆనంది తెలుగు, తమిళం తదితర భాషలలో కలిపి దాదాపుగా ఐదు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇందులో ఇప్పటికే “ఎంజిల్” అనే చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకోక శ్రీ దేవి సోడా సెంటర్ చిత్రం హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.మరో రెండు చిత్రాలు తమిళనాడులోని చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.

#Anandi #SriDevi #Sudheer Babu #TeluguHeroine #Anandi Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు