ఈ హీరోయిన్ కి పెళ్లయి విడాకులు కూడా తీసుకుందని మీకు తెలుసా ...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన “సమ్మోహనం” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “అదితి రావు హైదారి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సమ్మోహనం చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ అమ్మడికి వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.

 Telugu Heroine Aditi Rao Hydari Marriage And Divorce News, Aditi Rao Hydari, Tel-TeluguStop.com

కాగా ప్రస్తుతం అదితి రావు హైదరి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తదితర భాషల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే అందం అభినయం నటనా ప్రతిభతో సినీ ప్రేక్షకులను బాగానే మెప్పించిన ఈ హీరోయిన్ కి వివాహం జరిగినట్లు చాలా మందికి తెలియదు.అవును…  అదితి రావు హైదారి “సత్యదీప్ మిశ్రా” అనే ఓ ప్రముఖ లాయర్ ని 1999వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన 13 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు రావడంతో 2013 వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.

ఇక అప్పటి నుంచి అదితి రావు హైదారి ముంబై లో ఉన్నటువంటి తన సొంత నివాసంలో నివాసం ఉంటోంది. అయితే సినిమాల్లో ఎంతో క్యూట్ గా కనిపించే అదితి రావు హైదరి వయసు కూడా దాదాపుగా 42 సంవత్సరాలు పైనే ఉంటుంది.

కానీ ఇప్పటివరకు ఈ విషయాలు చాలా మందికి తెలియవు.

Telugu Aditirao, Telugu, Teluguaditi, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా  అదితి రావు హైదారి ఇటీవలే తెలుగులో ఇటీవలే “వి” అనే చిత్రంలో హీరోయిన్ గా నాని సరసన నటించింది. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.కాగా ప్రస్తుతం తెలుగులో “మహా సముద్రం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి ఆర్ ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube