మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని హీరోని అడిగిన నెటిజన్.... దాంతో...

తెలుగులో ప్రముఖ దర్శకుడు రవి చరణ్ రెడ్డి దర్శకత్వం వహించిన “కాళిదాసు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమయిన “అక్కినేని హీరో సుశాంత్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సుశాంత్ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కరెంట్, అడ్డా చిత్రాలతో ప్రేక్షకులని బాగానే అలరించాడు.

 Telugu Hero Sushant Akkineni React About His Girlfriend-TeluguStop.com

 కానీ ఆ తర్వాత నటించిన దొంగాట, ఆటాడుకుందాం రా చిత్రాలు ఫ్లాపయ్యాయి. దీంతో మళ్లీ రెండేళ్ళ తర్వాత టాలీవుడ్ హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన “చి.ల.సౌ” అనే చిత్రం ద్వారా హిట్ కొట్టాడు.

అయితే ఈ మధ్య కాలంలో అక్కినేని సుశాంత్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు. దీంతో తాజాగా అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్  అత్యుత్సాహం ప్రదర్శిస్తూ “మీకు గర్ల్ ఫ్రెండ్ వుందా.?” అంటూ అడిగాడు. దీంతో సుశాంత్ తనదైన శైలిలో స్పందిస్తూ “ఆ అన్నీ చెప్తారు మరి…” అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు.అలాగే మరో నెటిజన్ మీకు విలన్ గా నటించే అవకాశం వస్తే నటిస్తారా.? అని అడిగాడు. దీంతో సుశాంత్ “కథ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా విలన్ పాత్రలోనైనా” సరే నటిస్తానని సమాధానం ఇచ్చాడు.

 Telugu Hero Sushant Akkineni React About His Girlfriend-మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని హీరోని అడిగిన నెటిజన్…. దాంతో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అక్కినేని సుశాంత్ తెలుగులో “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తుండగా నూతన దర్శకుడు ఎస్.దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో ఈ చిత్రంతో హిట్ కొట్టాలని సుశాంత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

#SushantGirl #TeluguHero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు