మొదట్లో సినిమా అవకాశాల కోసం అంతలా కష్టపడ్డాను... కానీ....

తెలుగులో ప్రముఖ దర్శకుడు దేవకట్టా దర్శకత్వం వహించిన టువంటి “ప్రస్థానం” అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన టాలీవుడ్ యంగ్ హీరో “సందీప్ కిషన్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సందీప్ కిషన్ నటన పరంగా ఎంతో మంచి ప్రతిభ ఉన్నప్పటికీ ఇప్పటివరకు తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో సరైన హిట్ లేక సతమతవుతున్నాడు.

 Telugu Hero Sundeep Kishan About His First Movie Prasthanam Movie Chance, Prasth-TeluguStop.com

 కానీ అడపాదడపా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అప్పుడప్పుడూ బాగానే అలరిస్తున్నాడు.కాగా ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో  సందీప్ కిషన్ పాల్గొని తన సిని జీవన ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో తాను సినిమా అవకాశాల కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చానని కానీ తాను హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో తనకు ఇక్కడ ఎవరు తెలియకపోవడంతో కొంతమేర సినిమా అవకాశాల కోసం బాగానే శ్రమించానని చెప్పుకొచ్చాడు. చివరికి కష్టపడి స్నేహగీతం చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత కాలం పాటు ఆ చిత్రం షూటింగ్ పనులు నిలిపివేశారని దాంతో మళ్ళీ తను కొత్తగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిపాడు.

 

ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ హీరో శర్వానంద్ అక్క శిరీష ద్వారా తనకు “ప్రస్థానం” చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని ఈ ప్రస్థానం చిత్రం ద్వారా తన సినీ ప్రస్థానం మొదలైందని చెప్పుకొచ్చాడు.కానీ మొదట్లో తాను కేవలం ఈ చిత్ర ఆడిషన్స్ కి మాత్రమే వెళ్లానని,  కానీ చిత్ర యూనిట్ సభ్యులు మొదటి రోజె తనని సెలెక్ట్ చేసి షూటింగ్ కి రమ్మని పిలిచారని తెలిపాడు.

 కానీ ప్రస్థానం చిత్రం ఇప్పటికీ తన సినీ జీవితంలో మైలు రాయిగా నిలిచి పోయిందని తెలిపాడు.అలాగే సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో తన చిత్రాలకి నిర్మాత కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగానని, కానీ ఏ రోజు కూడా నిరాశపడకుండా శ్రమించానని అందువల్లే ఇప్పడు హీరోగా కొనసాగుతున్నానని చెప్పుకొచ్చాడు.

Telugu Sundeep Kishan, Telugu, Telugusundeep, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సందీప్ కిషన్ తెలుగులో “ఏ-వన్ ఎక్స్ ప్రెస్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండడంతో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు.కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.దీంతో ఇటీవలే తమిళ ప్రముఖ దర్శకుడు కార్తీక్ నరీన్ దర్శకత్వం వహిస్తున్న నరగాసురన్ అనే చిత్రంలో హీరో గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube