ఈ హీరో.... సినిమాల్లోకి వెళతానంటే తన భార్య మాత్రం...

సినిమా పరిశ్రమకి ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉద్యోగాలలో స్థిరపడినవారు సినిమాలపై మనసు మళ్లడంతో ఉన్నపలంగా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని లేదా చదువుతున్నటువంటి చదువుని వదిలిపెట్టి సినిమా పరిశ్రమకు వచ్చి విజయం సాధించిన సినీ సెలబ్రిటీలు  చాలా మంది ఉన్నారు. ఇందులో తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించినటువంటి మిస్టర్  పర్ ఫెక్ట్  చిత్రంలో హీరో స్నేహితుడి పాత్రలో నటించి సినిమా పరిశ్రమకు నటుడిగా పరిచయం అయిన టాలీవుడ్ యంగ్ హీరోస్ “సత్యదేవ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
  అయితే సత్యదేవ్ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కొంత మేర అవకాశాల కోసం శ్రమించినప్పటికీ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “జ్యోతి లక్ష్మి” చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.దీంతో సత్య దేవ్ కి టాలీవుడ్ సినీ పరిశ్రమలో గుడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది.

 Telugu Hero Satyadev About His Entry In Film Industry, Satyadev, Telugu Hero, S-TeluguStop.com

కాగా తాజాగా సత్యేదేవ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

Telugu Satyadev, Telugu, Telugu Satyadev, Timmarusu, Tollywood-Movie

అయితే ఇందులో తాను మొదట్లో సినిమా పరిశ్రమకు రావాలా.? వద్దా.? అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు తన భార్య దీపిక మన మనసుకు నచ్చింది చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామని ఎంతగానో ప్రోత్సహించిందని తెలిపాడు.  తాను ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో తన భార్యతో తన సినిమాలపై ఆసక్తి ఉందని చెప్పడంతో ఆమె తన భర్త కోరిక మేరకు వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లో ప్రయత్నించమని సూచించిందని అలా తాను సినిమాల్లోకి రావడానికి తన భార్య పాత్ర గురించి చెప్పుకొచ్చాడు.

అంతేగాక ఒకానొక సమయంలో తాను సినిమా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా తన భార్య దీపిక తనకు ఎంతగానో అండగా నిలిచిందని అలాగే ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం సాధిస్తామని మనోధైర్యం చెప్పిందట.

అంతేగాక కుటుంబ బాధ్యతలను కూడా మోస్తూ ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసుకుందని తాను ఇవాళ ఈ  స్థాయిలో ఉన్నానంటే తన భార్య దీపిక కారణమని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సత్యదేవ్ తెలుగులో “తిమ్మరుసు“అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

  ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయగా మంచి స్పందన లభించింది.కాగా ఈ చిత్రంలో సత్యదేవ్ న్యాయం కోసం పోరాటం చేసేటువంటి లాయర్ పాత్రలో కనిపిస్తాడు.

అలాగే ఇటీవలే సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం” అనే చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube