ప్లీజ్ అన్న... ఒక్క ఛాన్స్ ఇవ్వండని హీరో ని అడుగుతున్న బ్రహ్మాజీ...

మొత్తానికి ఊర్లో ఉంటే నా ఆలోచన ఇక్కడ అనుకుంటా నిజంగా హైదరాబాద్తెలుగులో హృదయ కాలేయం, కొబ్బరిమట్ట తదితర చిత్రాలలో హీరోగా నటించి తన కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన “బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో నటుడు సంపూర్ణేష్ బాబు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు కాగా ప్రస్తుతం దాదాపుగా 4 చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.

 Telugu Hero Sampoornesh New Movie Shooting Begins, Telugu Hero, Sampoornesh Babu-TeluguStop.com

అయితే అప్పుడప్పుడూ నటుడు సంపూర్ణేష్ బాబు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులను బాగానే అలరిస్తున్నాడు.

అయితే తాజాగా సంపూర్ణేష్ బాబు తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఈ ఫోటోని షేర్ చేశాడు.

అయితే ఈ ఫోటోకి “న్యూ ప్రాజెక్ట్… న్యూ బిగినింగ్…” అని క్యాప్షన్ కూడా పెట్టాడు.దీంతో కొందరు నెటిజన్లు సంపూర్ణేష్ బాబు కొత్త ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని ఆల్ ది బెస్ట్ తెలిపారు.

అయితే తాజాగా ఈ ఫోటో పై తెలుగు ప్రముఖ నటుడు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించాడు.ఇందులో భాగంగా నాకు ఒక్క ఛాన్స్ అన్నా ప్లీజ్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు.

దీంతో కొందరు నెటిజనులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.అంతే కాకుండా కామెడీ తెరపై చేయాలని సోషల్ మీడియాలో కాదంటూ సరదాగా బ్రహ్మాజీ కి రిప్లై ఇస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో బ్రహ్మాజీ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా వుంటూ అప్పుడప్పుడు ఇలా సరదాగా కామెంట్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Telugu Bramhaji, Sampoornesh, Telugu-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు తెలుగులో “బజార్ రౌడీ” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు కాగా ఈ చిత్రానికి తెలుగు నూతన దర్శకుడు “డి.వసంత నాగేశ్వర రావు” దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం కాగా ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు “రాధా కృష్ణ” అనే మరో కొత్త చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube