తెలుగులో “పిల్లా నువ్వు లేని జీవితం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోగా పరిచయమైన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు మరియు మెగా సుప్రీం హీరో “సాయి ధరమ్ తేజ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సాయి ధరమ్ తేజ్ మెగా స్టార్ చిరంజీవి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకుని తనకంటూ కొద్ది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా సుప్రీమ్, చిత్ర లహరి, ప్రతి రోజు పండగే, తదితర చిత్రాలతో బాగానే ఆకట్టుకున్నాడు.కానీ సరైన హిట్లు పడకపోవడంతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
అయితే సాయి తేజ్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటాడు.ఈ క్రమంలో అప్పుడప్పుడు తన అభిమానులతో లైవ్ కార్యక్రమాలు మరియు చిట్ చాట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముచ్చటిస్తూ ఉంటాడు.
కాగా తాజాగా ఓ నెటిజన్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని సాయి ధరమ్ తేజ్ ని అడిగాడ.దీంతో సాయి ధరమ్ తేజ్ ఈ విషయంపై స్పందిస్తూ తనకి టాలీవుడ్ టాప్ హీరోయిన్ “సమంత అక్కినేని” ఫేవరెట్ హీరోయిన్ అని తెలిపాడు.
దీంతో కొందరు సాయి ధరం తేజ్ నెగిటివ్ అభిమానులు ఈ విషయాన్ని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.దీంతో కొందరు మెగా అభిమానులు మాత్రం ఒక వ్యక్తిని అభిమానించడానికి, పెళ్లికి ఏమాత్రం సంబంధం లేదని అంటూ సమాధానం చెబుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల సాయి ధరమ్ తేజ్ తెలుగులో “సోలో బ్రతుకే సో బెటర్” అనే చిత్రంలో హీరోగా నటించాడు.కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.కాగా ప్రస్తుతం సాయి తేజ్ తెలుగు లో “రిపబ్లిక్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదల కాగా మంచి స్పందన లభించింది.
తాజా వార్తలు