నెక్స్ట్ సినిమాలో దానికోసం బాగానే కష్ట పడుతున్న ఎనర్జిటిక్ హీరో...

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ వైవిధ్యభరితమైన మరియు విభిన్న భారత మైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో అలరించే తెలుగు ప్రముఖ హీరో “రామ్ పోతినేని” గురించి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే రామ్ పోతినేని మొదటిగా తెలుగు ప్రముఖ సీనియర్ దర్శకుడు మరియు సినీ నిర్మాత “వైవిఎస్ చౌదరి” దర్శకత్వం వహించిన “దేవదాసు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు.

 Telugu Hero Ram Pothineni Is Hard Work For Six Pack Body In His Upcoming Film-TeluguStop.com

ఆ తరువాత జగడం, రెఢీ, నేను శైలజ, ఎందుకంటే ప్రేమంట తదితర ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

కాగా ప్రస్తుతం రామ్ పోతినేని తెలుగులో ప్రముఖ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 Telugu Hero Ram Pothineni Is Hard Work For Six Pack Body In His Upcoming Film-నెక్స్ట్ సినిమాలో దానికోసం బాగానే కష్ట పడుతున్న ఎనర్జిటిక్ హీరో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ చిత్రంలో రామ్ పోతినేని కి జోడిగా ఉప్పెన మూవీ ఫేమ్ “కృతి శెట్టి” హీరోయిన్ గా నటిస్తోంది.తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

అయితే ఈ చిత్రంలో రామ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని అంతేకాకుండా తన పాత్ర కోసం రామ్ కూడా చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

కాగా తాజాగా రామ్ పోతినేని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో “సిక్స్ ప్యాక్ బాడీ కోసం”z బాగానే కష్టపడుతున్నట్లు తెలియజేశాడు.

అంతేకాకుండా జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న సమయంలో తీసిన వీడియోని కూడా షేర్ చేశాడు.దీంతో రామ్ పోతినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అంతేకాకుండా గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక రామ్ పోతినేని కూడా చాలా సతమతవుతున్నాడు.ఖచ్చితంగా తన తదుపరి చిత్రం తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

కాగా ఇటీవలే రామ్ పోతినేని తెలుగులో “రెడ్” అనే చిత్రంలో హీరోగా నటించాడు.ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికి కలెక్షన్లు మాత్రం సాధించలేకపోయింది.దీంతో రామ్ పోతినేని సరైన హిట్ కోసం బాగానే శ్రమిస్తున్నాడు.

#Ram Pothineni #Pack #Linguswamy #Kriti Shetty #TeluguRam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు