ఆ ప్రొడ్యూసర్ నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టాలని చూసాడు... కానీ...

తెలుగులో పలు యాక్షన్ ఓరియంటెడ్ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన యాంగ్రీ యంగ్ మెన్ “రాజశేఖర్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రాజ శేఖర్ ఈ మధ్య హీరోగా నటించిన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.

 Telugu Hero Rajasekhar About Producer Money Cheating In Film Industry-TeluguStop.com

 దీంతో హీరో రాజశేఖర్ తన చిత్ర కథల విషయంలో కొంతమేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో హీరో రాజశేఖర్ పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు పట్టుకున్నాడు.

ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ “మీరు ఎప్పుడూ కూడా సినిమా షూటింగ్ సెట్ కి అనుకున్న సమయానికి రారని గంట లేదా అంతకంటే ఎక్కువ సేపు ఆలస్యంగా వస్తారని సినిమా ఇండస్ట్రీలో మీ గురించి చర్చించుకుంటున్నారని దీనిపై మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు.దీంతో రాజశేఖర్ స్పందిస్తూ తాను సినిమా షూటింగులకు ఆలస్యంగా వెళతాననే మాట వాస్తవమేనని స్పష్టం చేశాడు.

 Telugu Hero Rajasekhar About Producer Money Cheating In Film Industry-ఆ ప్రొడ్యూసర్ నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టాలని చూసాడు… కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అయితే ఇందులో తనకి పలు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందువల్లనే తాను అనుకున్న సమయానికి సినిమా షూటింగులకి వెళ్లలేక పోయానని చెప్పుకొచ్చాడు.అయితే తను సినిమా షూటింగులకి ఆలస్యంగా వెళతానని తప్ప ఇప్పటి వరకు తనపై ఎలాంటి రిమార్క్ లేదని చెప్పుకొచ్చాడు.

అలాగే తాను గతంలో సినిమాల్లో నటించేటప్పుడు పారితోషికం విషయం గురించి పెద్దగా పట్టించుకునే వాడిని కాదని, దాంతో కొందరు నిర్మాతలు పలు సాకులు చెప్పి తనకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని ఎగ్గొట్టేవారని తెలిపాడు.

దీంతో తన భార్య  జీవిత మరియు తాను కలిసి  ఈ విషయం గురించి బాగా ఆలోచించి తమ షూటింగ్ షెడ్యూల్ తేదీలు మరియు పారితోషకం విషయాలను చూసుకునేందుకుగాను సత్య రెడ్డి అనే డైరెక్టర్ ని నియమించుకున్నామని తెలిపాడు.

అప్పట్లో తాను ఓ ప్రముఖ సినీ నిర్మాత దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రంలో హీరోగా నటించానని దాంతో ఆ నిర్మాత తనకి దాదాపుగా 30 లక్షల రూపాయలు పారితోషకం ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడని, కానీ సత్య రెడ్డి వల్ల ఆ నిర్మాత నుంచి డబ్బులు రాబట్టుకున్నామని తెలిపాడు. దీంతో ఆ సినీ నిర్మాత తమ గురించి సినిమా పరిశ్రమలో తప్పుడు ప్రచారాలు చేయడం వంటివి చేస్తున్నాడని తెలిపాడు.

అలాగే ఇప్పటి వరకూ తాను షూటింగులకు ఆలస్యంగా వెళతాననే కారణం తప్పా తాను ఎవరిని మోసం చేయడం గానీ లేదా హాని చేయడం వంటివి చేయలేదని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాజశేఖర్ తెలుగులో “అర్జున” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కాగా మంచి స్పందన వచ్చింది.అయితే ఈ చిత్రంలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.దీంతో ఈ వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

#TeluguHero #Jeevitha #DirectorAnd #RajasekharAbout #ArjunaMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు