దేవుడి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారంటున్న తెలుగు హీరో... కానీ..

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా”అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ హీరో “రాజా” గురించి తెలుగు సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే మొదట్లో రాజా తన చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ క్రమక్రమంగా తన తదుపరి చిత్ర కథ విషయాలలో కొంతమేర అవగాహన లోపించడంతో సినిమా అవకాశాలు దక్కించుకోలేక పోయాడు.

 Telugu Hero Raja Reacts About Fraud With God Name, Raja, Telugu Hero, Tollywood,-TeluguStop.com

దీంతో సినిమాలకి స్వస్తి పలికి ప్రస్తుతం క్రిస్టియన్ కమ్యూనిటీ లో చేరి మత బోధకుడిగా పని చేస్తున్నాడు.

అయితే ఆ మధ్య ఓ ప్రముఖ వార్త చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో హీరో రాజా పాల్గొని కొందరు దేవుడి పేరుతో చేస్తున్న మోసాల గురించి స్పందించాడు.

 ఇందులో భాగంగా ప్రస్తుత కాలంలో కొందరు దేవుడి పేరుని అడ్డంపెట్టుకుని వ్యాపారాలు, మోసాలు చేస్తున్నారని  అలాంటి వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పుకొచ్చాడు.

అంతేగాక కొందరు తప్పుడు ప్రచారాలతో నిజాలను కప్పి పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాబట్టి నిజానిజాలు తెలుసుకుని ప్రజలు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

Telugu Fraud God, Raja, Telugu, Teluguraja, Tollywood, Vennela-Movie

అయితే తాను క్రిస్టియన్ కమ్యూనిటీ లో చేరడానికి తనని ఎవరు బలవంత పెట్టలేదని తనకు తానుగా నచ్చి అందులో చేరానని తెలిపాడు.ఆ తర్వాత తాను ఈ మధ్య కాలంలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయని కానీ అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు.తాను ఎప్పటికీ ఇలాగే మత బోధకుడిగా కొనసాగుతానని చెప్పుకొచ్చాడు.ఇక సినిమాలలో రీ ఎంట్రీ పై స్పందిస్తూ ప్రస్తుతం తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని భవిష్యత్తులో తన పాత్రకి స్కోపు ఉన్నటువంటి అవకాశం వస్తే ఆలోచిస్తానని స్పష్టం చేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube