తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన టువంటి హ్యాపీ డేస్ చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. అయితే ఈ చిత్రంలో దాదాపుగా శేఖర్ కమ్ముల అందరిని కొత్త నటీనటులను నటింపజేసి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాడు.
అయితే ఈ చిత్రంలో టైసన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో “రాహుల్ హరిదాస్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే రాహుల్ హరిదాస్ వచ్చి రావడంతోనే మొదట్లో బాగానే ఆకట్టుకోవడంతో హీరో అవకాశాలను దక్కించుకున్నాడు.
కానీ తన తదుపరి చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో బాక్సా ఫెస్ వద్ద వరుస ప్లాపులను ఎదుర్కొన్నాడు. కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో రాహుల్ పాల్గొని తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో తాను సినిమా అవకాశాల కోసం వేచి చూస్తున్న సమయంలో తన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శేఖర్ కమ్ముల ఆఫీస్ కి వెళ్లానని దాంతో తనని ఆడిషన్ చేసినటువంటి శేఖర్ కమ్ముల వెంటనే తన చిత్రంలోని టైసిన్ పాత్రకు సెలెక్ట్ చేశాడని తెలిపాడు. కానీ మొదట్లో తాను టైసిన్ పాత్ర కథ గురించి సరిగ్గా తెలియక నటించనని చెప్పానని దాంతో ఈ చిత్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న తన ఫ్రెండ్ పూర్తి కథని తెలియాజేయడంతో వెంటనే ఒకే చెప్పానని తెలిపాడు.
కానీ తన జీవితంలో లైఫ్ హ్యాపీ డేస్ చిత్రం మైలు రాయిగా నిలిచిపోయిందని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా రాహుల్ హరిదాస్ హ్యాపీడేస్ చిత్రం తర్వాత, రెయిన్బో, లవ్ యూ బంగారం, వెంకటాపురం, ముగ్గురు, ప్రేమ ఒక మైకం, మ్యూజిక్ మ్యాజిక్ తదితర చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు.
దీంతో సినిమా అవకాశాలను కూడా దక్కించుకోలేక పోయాడు.కాగా ఈ మధ్య కాలంలో రాహుల్ హరిదాస్ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడి చిత్రంలో హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రాహుల్ స్పందించకపోవడంతో ఇందులో నిజం ఎంతుందనే అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
.