సిక్స్ ప్యాక్ బాడీ తో రెచ్చిపోతున్న యంగ్ హీరో... కానీ అవకాశాలు మాత్రం....

తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “నీకు నాకు డాష్ డాష్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన ప్రముఖ హీరో “ప్రిన్స్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు ప్రిన్స్ క్రమక్రమంగా తన నటనా ప్రతిభను నిరూపించుకుని అవకాశాలు దక్కించుకున్నప్పటికీ కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లను ఎదుర్కొన్నాడు.

 Telugu Hero Prince Show Up With Six Pack Body-TeluguStop.com

అయినప్పటికీ అవకాశాల కోసం పట్టు విడవకుండా శ్రమిస్తూనే ఉన్నాడు.ఈ క్రమంలో ప్రిన్స్ ఎప్పటికప్పుడు తనని అప్డేట్ చేసుకుంటూ సిక్స్ ప్యాక్ బాడీ మరియు నటన పరంగా మెళకువలు నేర్చుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నాలు బాగానే చేస్తున్నాడు.

అయినప్పటికీ ఎందుకో ఆశించిన స్థాయిలో అవశాలను మాత్రం అందుకోలేక పోతున్నాడు.

 Telugu Hero Prince Show Up With Six Pack Body-సిక్స్ ప్యాక్ బాడీ తో రెచ్చిపోతున్న యంగ్ హీరో… కానీ అవకాశాలు మాత్రం….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో ప్రిన్స్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు.

ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన సినిమా సమాచారాన్ని మరియు వ్యక్తిగత సమాచారాన్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు.కాగా తాజాగా ప్రిన్స్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్న ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

అంతేకాక ఈ ఫోటోకి “ర్యాంబో చిత్రాన్ని తెలుగులో తీస్తే కచ్చితంగా ఇతడే హీరో” అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.దీంతో కొందరు ప్రిన్స్ అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

అంతేగాక ఇప్పటికీ సరైన కంటెంట్ ఉన్నటువంటి కథ పడితే ప్రిన్స్ మళ్లీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోగలడని కామెంట్లు చేస్తున్నారు.కాబట్టి ఇప్పటికైనా ప్రిన్స్  కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తే హిట్ ట్రాక్ ఎక్కి ప్రేక్షకులను అలరిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Prince, Prince Movie Offers, Prince Six Pack Body, Telugu Hero, Telugu Hero Prince Show Up With Six Pack Body, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ప్రిన్స్ హీరోగా నటించిన బస్ స్టాప్, రొమాన్స్, జబర్థస్త్, నేను శైలజ, తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.కానీ ఆ తర్వాత నటుడు ప్రిన్స్ గెస్ట్ అప్పియరెన్స్ మరియు కామీయో అప్పియరెన్స్ తదితర పాత్రలలో నటించాడు.దీంతో హీరోగా నటించే అవకాశాలను కోల్పోయాడు.దీనికితోడు ప్రస్తుతం ప్రిన్స్ కి హీరోగా నటించే అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీలో కొంతమేర తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.

#TeluguHero #Prince #PrinceSix #PrinceMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు