హీరో అవుతానంటే మా నాన్న అస్సలు ఒప్పుకోలేదు.. .. చివరికి...

తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్”  చిత్రంలో  నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించి సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన యంగ్ హీరో “నవీన్ పోలిశెట్టి” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ముందుగా నవీన్ పోలిశెట్టి సినిమాల్లోకి రాక ముందు పలు లఘు చిత్రాలలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Telugu Hero Naveen Polishetty About His Father And Hero Entry News-TeluguStop.com

ఆ మధ్య నూతన దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జే దర్శకత్వం వహించిన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” చిత్రంతో హిట్ కొట్టి ఓవర్ నైట్ లో స్టార్ అయ్యాడు.దీంతో ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు.

కాగా ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తెలుగులో నూతన దర్శకుడు అనుదీప్.కేవీ దర్శకత్వం వహిస్తున్న “జాతి రత్నాలు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రం ఈ నెల 11వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.దీంతో ఈ చిత్ర  ప్రమోషన్స్ లో  భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 Telugu Hero Naveen Polishetty About His Father And Hero Entry News-హీరో అవుతానంటే మా నాన్న అస్సలు ఒప్పుకోలేదు.. .. చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా తాను హైదరాబాద్ లో పుట్టి పెరిగానని చెప్పుకొచ్చాడు.కానీ తన తండ్రి ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలలో మారాల్సి వచ్చేదని అందువల్ల తాను దేశ వ్యాప్తంగా తిరుగుతూ చదువుకున్నానని తెలిపాడు.

తనకి ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచే సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేదని తెలిపాడు.

అలాగే తాను పాఠశాలలో చదువుతున్న సమయంలో అనుకోకుండా తల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చిందని మొదటి సారే తాను లేడీ గెటప్ ధరించి బాగా నటించడంతో తన తల్లిదండ్రులతో పాటూ  ఉపాధ్యాయులు కూడా బాగానే ప్రశంసించారని చెప్పుకొచ్చాడు.

అలా తనకి నటనపై ఆసక్తి పెరిగిందని  కానీ తన తండ్రి మాత్రం సినిమాల్లో హీరోగా నటిస్తానంటే అస్సలు ఒప్పుకోలేదని తెలిపాడు. అలాగే తాను హీరో అవుతానని ఎప్పుడు చెప్పినా తన తండ్రి ఏదో ఒక వంకతో సినిమా పరిశ్రమకు వెళ్లనివ్వకుండా చేసేవాడని దాంతో తన చదువు పూర్తయిన తర్వాత తన హీరో అవ్వాలనే కల గురించి తన తండ్రితో వివరంగా మాట్లాడి సినిమా పరిశ్రమ వైపు వచ్చానని తెలిపాడు.

ఎలాంటి సినిమా కుటుంబ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం తనకంటూ సినిమా పరిశ్రమలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంలో నటించడానికంటే ముందుగా తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే మరియు యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన “డి ఫర్ దోపిడి” తదితర చిత్రాలలో నటించాడు.

 కానీ ఆ చిత్రాలలో నవీన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.

#HeroEntry #JathiRatnalu #JathiRatnalu #TeluguHero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు