ఈ హీరో కోసం ఓ అభిమాని ఏకంగా లేచిపోదామా అంటూ…  

telugu hero Naveen Chandra revealed about his love incident in railway station, Naveen Chandra, Tollywood hero, Andala Rakshasi move hero, Love Story, Alitho Saradaga, ETV - Telugu Alitho Saradaga, Andala Rakshasi Move Hero, Etv, Love Story, Naveen Chandra, Telugu Hero Naveen Chandra Revealed About His Love Incident In Railway Station, Tollywood Hero

తెలుగులో ప్రముఖ దర్శకులు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన “అందాల రాక్షసి” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర గురించి సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే తెలుగులో నవీన్ చంద్ర కేవలం హీరో పాత్రలలో మాత్రమే కాకుండా పలు గెస్ట్ అప్పియరెన్స్ మరియు విలన్ పాత్రలో కూడా నటించి మెప్పించాడు.అయితే తాజాగా నవీన్ చంద్ర ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీలో ప్రతి మంగళవారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే “ఆలీతో సరదాగా” అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

TeluguStop.com - Telugu Hero Naveen Chandra Revealed About His Love Incident In Railway Station

అయితే ఇందులో అందాల రాక్షసి సినిమా విడుదలైన మూడు రోజులకి ఓ అభిమాని తనకు అభినందనలు తెలుపుతూ ఫోన్ చేసిందని ఈ క్రమంలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అంటూ చెబుతూ ఫోన్ పెట్టేసిందని తెలిపాడు.

ఆ తర్వాత వెంటవెంటనే తనకి ఫోన్ చేస్తూ విసిగించడంతో తాను ఫోన్ స్విచాఫ్ చేసి పడుకున్నానని దాంతో ప్రొద్దున్నే లేచి చూసే సమయానికి ఆ అభిమాని నుంచి తనకు మెసేజ్ వచ్చిందని ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యానని తెలిపాడు.

TeluguStop.com - ఈ హీరో కోసం ఓ అభిమాని ఏకంగా లేచిపోదామా అంటూ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముందంటే తాను నవీన్ చంద్రను గాడంగా ప్రేమిస్తున్నానని కాబట్టి మనిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందామని అలాగే తాను ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏడో నెంబర్ ప్లాట్ ఫారం వద్ద తన కోసం వేచి చూస్తున్నారని వెంటనే రావాలని ఉంది.

దీంతో కంగారుపడిన నవీన్ చంద్ర వెంటనే తన స్నేహితుడిని తీసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లి చూడగా తన అభిమాని ఏకంగా డబ్బులు, నగలు మరియు ఇతర ఖరీదైన వస్తువులతో తన కోసం వేచి చూస్తూ ఉందని తెలిపాడు.అయితే ఆ తర్వాత ఏమైంది అనే విషయం తెలియాలంటే వచ్చే మంగళవారం వరకు ఆగాల్సిందే.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నవీన్ చంద్ర తెలుగులో మిస్ ఇండియా అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.అలాగే ఇటీవలే భానుమతి & రామకృష్ణ అనే చిత్రంలో నటించగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ సభ్యులు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అయినటువంటి ఆహాలో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

#AndalaRakshasi #TeluguHero #Naveen Chandra #Alitho Saradaga #Love Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Hero Naveen Chandra Revealed About His Love Incident In Railway Station Related Telugu News,Photos/Pics,Images..