అమాయికుడిలా ఉన్నావంటూ మంచు మనోజ్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన యంగ్ హీరో...

Telugu Hero Navdeep Funny Reply To The Manchu Manoj Marriage Tweet

మామూలుగా సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ఏదైనా ఒక వార్త బయటకు పొక్కింది అంటే చాలు అందులో నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు తెగ ట్రోల్స్ చేస్తుంటారు.అంతటితో ఆగకుండా లేనిపోనివి కథలు అల్లుతూ తెగ ప్రచారం చేస్తుంటారు సోషల్ మీడియా మాధ్యమాలలో.

 Telugu Hero Navdeep Funny Reply To The Manchu Manoj Marriage Tweet-TeluguStop.com

అయితే తాజాగా తెలుగు ప్రముఖ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.దీంతో తాజాగా మంచు మనోజ్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయంపై స్పందించాడు.

ఇందులో భాగంగా తన పెళ్ళికి తనని కూడా పిలవాలని అలాగే వెడ్డింగ్ వేదిక ఎక్కడో చెప్పాలని కూడా తనదైన శైలిలో స్పందిస్తూ రిప్లై ఇచ్చాడు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 Telugu Hero Navdeep Funny Reply To The Manchu Manoj Marriage Tweet-అమాయికుడిలా ఉన్నావంటూ మంచు మనోజ్ ట్వీట్ కి రిప్లై ఇచ్చిన యంగ్ హీరో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా మంచు మనోజ్ ఇచ్చిన రిప్లై పై మరో టాలీవుడ్ హీరో నవదీప్ కూడా స్పందించాడు.ఇందులో భాగంగా ‘ఆహా! లేకపోతే నీ ఇష్టం అనుకున్నావా ఏంటి.

మరీ అమాయకుడిలా ఉన్నావే’ అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు.దీంతో మంచు మనోజ్ మరియు నవదీప్ కాన్వర్సేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తాజాగా ఇటీవలే తెలుగు ప్రముఖ నటి మంచు లక్ష్మి కూడా వీరిద్దరి కాన్వర్సేషన్ పై స్పందిస్తూ సరదాగా నవ్వుతూ రిప్లై ఇచ్చింది.

Telugu Manchu Lakshmi Funny Reply, Manchu Manoj, Manchu Manoj Marriage Tweet, Navdeep, Telugu Hero, Telugu Hero Navdeep Funny Reply To The Manchu Manoj Marriage Tweet, Tollywood-Movie

దీంతో కొందరు నెటిజన్లు మంచు మనోజ్ పెళ్లి గురించి వినిపించిన వార్తలపై స్పందిస్తూ ఈ మధ్యకాలంలో కొందరు సినీ సెలబ్రిటీల గురించి అసత్య కథనాలు ప్రచారం చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారని దాంతో సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో మంచు మనోజ్ హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.దీంతో కథల పరంగా కొంత మేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు మంచు మనోజ్.

కాగా ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే తెలుగు చిత్రంలో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ పలు కారణాల వల్ల విడుదలకు కొంతకాలం పాటు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం.

#Navdeep #ManchuLakshmi #TeluguNavdeep #Manchu Manoj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube