ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..?

Telugu Hero Nagarjuna Childhood Photos Viral

తెలుగులో ప్రముఖ స్వర్గీయ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమై టాలీవుడ్ మన్మథుడు గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు అయితే నాగార్జున ఈ మధ్యకాలంలో ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలలో హీరోగా నటిస్తూ దూసుకుపోతున్నాడు.అంతే కాకుండా మరో పక్క తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ లో హోస్టింగ్ నిర్వహిస్తూ బాగానే అలరిస్తున్నాడు.

 Telugu Hero Nagarjuna Childhood Photos Viral-TeluguStop.com

అయితే మొదటిగా అక్కినేని నాగార్జున సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తన తండ్రి పేరు ప్రఖ్యాతలను ఏ మాత్రం ఉపయోగించుకోకుండా తన ప్రతిభను నిరూపించుకునే స్టార్ హీరో హోదాని దక్కించుకున్నాడు.అలాగే ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ యంగ్ లుక్ లో అదరగొడుతున్నాడు.

కాగా తాజాగా అక్కినేని నాగార్జున కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే హీరో నాగార్జున చిన్నప్పటినుంచి ఇప్పటివరకు తీసినటువంటి ఫోటోలు నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది.

 Telugu Hero Nagarjuna Childhood Photos Viral-ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కొందరు అక్కినేని నాగార్జున అభిమానులు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.అంతే కాకుండా చిన్నప్పుడు నాగార్జున చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

Telugu Bangarraju, Nagarjuna, Telugu, Telugunagarjuna, Wild Dog-Movie

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే హీరో నాగార్జున తెలుగులో వైల్డ్ డాగ్ అనే చిత్రంలో హీరోగా నటించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే అలరించింది.మంచి విజయంతో ఏడాదిని ఆరంభించిన నాగార్జున కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులను నిలిపివేయడంతో రెండో హిట్టు ఖాతాలో వేసుకోలేక పోయాడు.దీంతో ప్రస్తుతం హీరో నాగార్జున తెలుగులో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న బంగార్రాజు అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో హీరో నాగార్జున జంటగా తెలుగు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుండగా హీరో అక్కినేని నాగచైతన్య మరియు బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి గెస్ట్ పాత్రలలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#TeluguNagarjuna #Nagarjuna #Wild Dog #Bangarraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube