అమ్మ బాబోయ్ : ఈ యంగ్ హీరో ధరించే షూ విలువ లక్షల్లో ఉంటుందట...

టాలీవుడ్ లో 2014వ సంవత్సరంలో “చందమామ కథలు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో “నాగ శౌర్య” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నాగ శౌర్య కి మంచి కటౌట్, నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ కథల పట్ల సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో పెద్దగా రాణించలేక పోతున్నాడు.

 Telugu Hero Naga Shaurya Shows Price Is Trolling In Social Media, Naga Shaurya,-TeluguStop.com

దీంతో నాగ శౌర్య హీరోగా నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం డిజాస్టర్లు ఉన్నాయి.కాగా ఆ మధ్య చలో, ఒక మనసు, ఊహలు గుసగుసలాడే తదితర చిత్రాలతో ప్రేక్షకులని ఆకట్టుకున్నప్పటికీ నర్తనశాల, కళ్యాణ వైభోగమే, జాదూ గాడు, లక్ష్మీ రావే మా ఇంటికి, దిక్కులు చూడకు రామయ్య, తదితర చిత్రాలతో నిరాశపరిచాడు.

దీంతో కథల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.

ప్రస్తుతం నాగ శౌర్య తెలుగులో “లక్ష్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు “సంతోష్ జాగర్లమూడి” దర్శకత్వం వహిస్తుండగా నారాయణ దాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.అయితే ఈ చిత్రం కోసం హీరో నాగశౌర్య బాగానే కష్ట పడుతున్నాడు ఇందులో భాగంగా ఇప్పటికే సిక్స్ ప్యాక్ బాడీ కోసం రోజు జిమ్ వర్క్ ఔట్ అలాగే ఆహారపు డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వంటివి పాటిస్తున్నాడు.

కాగా తాజాగా నాగ శౌర్య బయటకు వచ్చిన సమయంలో ధరించిన బూట్ల ధర గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇందులో నాగశౌర్య జిమ్ చేసేటప్పుడు ధరించే షూ ఖరీదు దాదాపుగా రూ.1,45,999/- (లక్షా నలభై ఐదు వేల రూపాయల)కు పైగా ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు.దీంతో నాగ శౌర్య ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టేందుకు బాగానే కష్టపడుతున్నాడని అలాగే ఖర్చు పెడుతున్నాడని కూడా కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Lakshya, Naga Shaurya, Telugunaga, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య నాగశౌర్య “అశ్వద్ధామ” అనే చిత్రంలో హీరోగా నటించాడు.కానీ ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.దీంతో తన తదుపరి చిత్రం విషయంలో నాగ శౌర్య చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు.కాగా ప్రస్తుతం నాగశౌర్య “వరుడు కావలెను అబ్బాయి అమ్మాయి పోలీసువారి హెచ్చరిక నారీ నారీ నడుమ మురారి మరియు మరో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంతో” కలిపి దాదాపు ఐదు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube