ఈ ఫొటోలో కనిపిస్తున్న బుట్ట బొమ్మలు స్టార్ హీరో కూతుళ్ళని మీకు తెలుసా..?  

తెలుగులో ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించిన “విష్ణు” అనే చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు “మంచు విష్ణు” గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మంచు విష్ణు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో విష్ణు, అస్త్రం, ఢీ, సలీమ్, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, తదితర చిత్రాలతో  ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాడు.

TeluguStop.com - Telugu Hero Manchu Vishnu Daughters Ariyana And Viviana Looks Cute In Traditional Attire

 కానీ ఈ మధ్య కాలంలో మంచు విష్ణు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు.దీంతో మంచు విష్ణు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

అయితే ఇటీవలే మంచు విష్ణు గారాల పాటలు తన కూతుళ్ల పుట్టినరోజు కావడంతో అరియనా, వివియానా, ల ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.అంతేగాక తన కూతురుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వీరిద్దరూ తన జీవితంలో ఎంతో సంతోషాన్ని నింపారని,  వీళ్లు పుట్టిన తర్వాత తన జీవితానికి ఒక అర్థం దొరికిందని, వీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలని దీవెనలు అందించాడు.

TeluguStop.com - ఈ ఫొటోలో కనిపిస్తున్న బుట్ట బొమ్మలు స్టార్ హీరో కూతుళ్ళని మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ప్రస్తుతం ఆరియానా, వివియానా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీంతో కొందరు నెటిజన్లు కూడా వీరిద్దరికి పుట్టిన రోజు శుభాకాంక్షలను కామెంట్ల రూపంలో తెలియజేశారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా మంచు విష్ణు తెలుగులో “మోసగాళ్లు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో మంచు విష్ణు తో పాటూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్రా పోషిస్తోంది.

కాగా ఈ చిత్రానికి “జెఫ్రీ గీ చిన్” దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయ్యాయి కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఇటీవలే మంచు విష్ణు తన తండ్రి మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి “సన్ ఆఫ్ ఇండియా” అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

#Ariyana Manchu #Viviana Manchu #Manchu Vishnu #TeluguHero #AriyanaAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Hero Manchu Vishnu Daughters Ariyana And Viviana Looks Cute In Traditional Attire Related Telugu News,Photos/Pics,Images..