ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని మా నాన్న ముందే చెప్పాడు.. కానీ ...

తెలుగులో ఇటీవలే ప్రముఖ హీరో మంచు విష్ణు “మోసగాళ్లు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ముందుకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రం వాస్తవిక సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

 Telugu Hero Manchu Vishnu About His Flop Movies, Telugu Hero, Manchu Vishnu, Moh-TeluguStop.com

కాగా ఈ చిత్రంలో తెలుగు ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్, నవదీప్, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

ఈ చిత్రానికి హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించగా ఈ చిత్రంలో హీరోగా నటించిన నటుడు మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించాడు.

దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం కనీసం 25 కోట్ల రూపాయలు కూడా వసూలు చేసిన దాఖలాలు లేవు.తాజాగా హీరో మంచు విష్ణు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా ఇప్పటి వరకు తాను నటించిన చిత్రాలను మొదటగా తన తండ్రి మంచు మోహన్ బాబు చూసి ఆ సినిమా ఫ్లాప్ అవుతుందా.? లేక హిట్ అవుతుందా.? ముందే జడ్జిమెంట్ ఇచ్చేవాడని అలాగే ఇప్పటివరకూ తన తండ్రి ఇచ్చిన జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పు కాలేదని చెప్పుకొచ్చాడు.దీంతో గతంలో తానె నిర్మాతగా మారి ఓ సినిమాని తెరక్కించానని కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయ్యిందని దాంతో ఒక సంవత్సరం పాటూ సినిమాల జోలికి వెళ్లలేదని తెలిపాడు.

కానీ ఆ సినిమా చెప్పడానికి మాత్రం మంచు విష్ణు ఇష్ట పడలేదు

అలాగే ప్రస్తుతం తనకు తెలుగు సినిమా పరిశ్రమలో 50 కోట్ల రూపాయలు మార్కెట్ విలువ లేదని కానీ సినిమా పరిశ్రమలో మార్కెట్ అనేది ఒక్క హిట్ మరియు ఒక శుక్రవారం నిర్ణయిస్తుందని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.అయితే ఇప్పటి వరకు తన కెరియర్లో “దూసుకెళ్తా” చిత్రం 40 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిందని కానీ మోసగాళ్లు చిత్ర కథ తనకు బాగా నచ్చడంతోనే “50” కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టడానికి” ధైర్యం చేశానని స్పష్టం చేశాడు.

అలాగే ఈ చిత్రం కోసం దాదాపుగా తాను ఇప్పటివరకు సినిమాలలో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పెట్టుబడిగా పెట్టి రిస్క్ చేసానని తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు విష్ణు తెలుగులో “భక్త కన్నప్ప” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈ చిత్రానికి కూడా దాదాపు 90 కోట్ల రూపాయలు బడ్జెట్ వెచ్చించనున్నట్లు సమాచారం.అలాగే గతంలో మంచి హిట్ అయిన “ఢీ” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న “ఢీ అండ్ ఢీ” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

తొందర్లోనే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ పనులు మొదలు కానున్నట్లు సమాచారం.

కాగా తెలుగులో తన తండ్రి మంచు మోహన్ బాబు హీరోగా నటిస్తున్న “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా 40 శాతం పూర్తయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube