ఆ సినిమా ప్లాప్ అవుతుందని డైరెక్టర్ కి ముందే చెప్పా... వినలేదు... చివరికి...  

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు గురించి సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.మొదటగా మంచు విష్ణు తెలుగులో ప్రముఖ దర్శకుడు షాజీ కైలాష్ దర్శకత్వం వహించిన  “విష్ణు” అనే చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

TeluguStop.com - Telugu Hero Manchu Vishnu About His Achari America Yatra Movie Flop

అయితే మంచు విష్ణు సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో ఢీ, సూర్య, అస్త్రం, సలీం, దేనికైనా రెడీ, డైనమేట్, తదితర చిత్రాలతో బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో తన చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ప్రేక్షకులను పెద్దగా రాణించలేకపోయాడు.

 దీంతో గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ మంచు విష్ణు పాల్గొని తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

TeluguStop.com - ఆ సినిమా ప్లాప్ అవుతుందని డైరెక్టర్ కి ముందే చెప్పా… వినలేదు… చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ “గతంలో మీరు వరుస సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించేవారు. కానీ ఈ మధ్యకాలంలో మీ సినిమాలు సరిగ్గా ప్రేక్షుకులను అలరించలేక పోతున్నాయి.

 అంతేకాక మీరు కూడా ఈ మధ్య సినిమాలను చేయడం బాగా తగ్గించేశారు. దీనికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.

 దీంతో మంచు విష్ణు ఈ విషయంపై స్పందిస్తూ తనకు కూడా మంచి సినిమాలు చేయాలని ఉందని కానీ తన అంచనాలను అందుకునే కథలు దొరకడం లేదని అందువల్లనే సినిమాలు చేయడం తగ్గించేశానని తెలిపాడు.

అంతేగాక తను సినిమాలు చేయకపోయినా ఎవరూ పెద్దగా అడగరని కానీ ఫ్లాప్ సినిమాలు తీస్తే మాత్రం ఒక పక్క తన అభిమానులు మరోపక్క తన కెరీర్ ఇలా చాలా విషయాలు దెబ్బతింటాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇందుకు ఉదాహరణగా తాను గతంలో హీరోగా నటించిన “ఆచారి అమెరికా యాత్ర” చిత్రం ఫ్లాప్ అవుతుందని ముందే  తాను పసిగట్ట ఈ విషయం గురించి దర్శకుడుకి కూడా చెప్పానని కానీ దర్శకుడు తన మాటలను లెక్క చేయకుండా సినిమాను తెరకెక్కించాడని దాంతో ఫలితం తాను అనుకున్నట్లే ఫ్లాప్ అయిందని తెలిపాడు.దాంతో అప్పుడే చిత్ర  కథల ఎంపిక విషయంలో శ్రద్ధ వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు విష్ణు తెలుగులో “మోసగాళ్లు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, జగపతి బాబు తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

  ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.దీంతో ఇటీవలె మంచు విష్ణు “సన్ ఆఫ్ ఇండియా” అనే చిత్రంలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 అంతేగాక ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

#TeluguHero #Manchu Vishnu #MosagalluMovie #Director #AchariAmerica

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు