సౌందర్యతో నా పెళ్లి జరిగేది... కానీ ఆ గొడవ మమ్మల్ని...

తెలుగులో ఒకప్పుడు కలువు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీనియర్ హీరో “జేడీ చక్రవర్తి” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.జేడీ చక్రవర్తి  ఎప్పుడూ కూడా విభిన్న తరహా కథలతో ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు.

 Telugu Hero Jd Chakravarthy About His Marriage With Actress Soundarya-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో జేడీ చక్రవర్తి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు.తాజాగా జేడీ చక్రవర్తి  హీరోగా నటించిన ఎమ్‌.

ఎమ్‌.ఓ.ఎఫ్‌ ఉరఫ్‌ 70 ఎమ్‌.ఎమ్‌’  చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు…

 Telugu Hero Jd Chakravarthy About His Marriage With Actress Soundarya-సౌందర్యతో నా పెళ్లి జరిగేది… కానీ ఆ గొడవ మమ్మల్ని…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా ఈ చిత్రం థ్రిల్లర్ జోనర్ తరహాలో తెరకెక్కించామని కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.అంతేగాక ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయగా మంచి స్పందన లభించిందని కూడా చెప్పుకొచ్చాడు.అలాగే ఇంతకు ముందులాగా మీ చిత్రాలు ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయని దీనికి కారణం ఏమిటని అడుగగా తాను ఈ మధ్య కాలంలో తన చిత్ర కథల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే కారణమని తెలిపాడు.

అలాగే గతంలో మాదిరిగా ప్రేక్షకులని మళ్లీ అలరించడానికి తన సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నానని కూడా చెప్పుకొచ్చాడు.

ఇక గతంలో తనకు సినిమా పరిశ్రమలో బాగా కావలసినటువంటి ముగ్గురు వ్యక్తులు టాలీవుడ్ ప్రముఖ స్వర్గీయ నటి సౌందర్య తో తన పెళ్లి చేయాలని చాలా ప్రయత్నించారని కానీ అనివార్య కారణాల వల్ల ఆమెని పెళ్లి చేసుకోలేకపోయానని తెలిపాడు.

అంతేగాక సౌందర్యతో ప్రేమకు వేళాయరా.! చిత్రంలో నటిస్తున్న సమయంలో తమ ఇద్దరి మధ్య ఓ చిన్న అపార్ధం వల్ల గొడవ జరిగిందని దాంతో కొద్ది రోజులుగా తామిద్దరూ మాట్లాదుకోలేదని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత అపార్థాలు తొలగి పోవడంతో మంచి మిత్రులమయ్యామని తెలిపాడు.అయితే సౌందర్య కి దర్శకత్వం వైపు చాలా ఆసక్తి ఉండేదని అందువల్లే ఓ కథను కూడా సిద్ధం చేసుకొని తనకు కూడా వినిపించిందని ఆ కథ తనకు ఎంతో నచ్చిందని కానీ ఆ చిత్రాన్ని పట్టాలు ఎక్కించే క్రమంలోనే సౌందర్య కన్నుమూసిందని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.

#Soundarya #TeluguHero #TeluguHero #JdChakravarty #Foremer Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు