అందుకే బాలయ్య బాబు ఆ హీరోని ఇంటికి పిలిచి చెంప చెల్లుమనిపించాడట...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలియనివారు ఉండరు.అయితే నందమూరి బాలకృష్ణకి 60 ఏళ్ళు నిండినప్పటికీ ఇప్పటికీ అదే ఎనర్జీతో కుర్రాడిలా సినిమాలో చేస్తూ దూసుకుపోతున్నాడు.

 Telugu Hero Balakrishna Giving Slap To The Young Hero-TeluguStop.com

ఇందులో హిట్టు ప్లాపులతో ఏమాత్రం సంబంధం ఉండదు.అయితే బాలయ్య బాబు కి కొంచెం కోపం ఎక్కువని అలాగే ముక్కు సూటిగా మాట్లాడతాడని అందరికీ తెలిసిందే.

తాజాగా నందమూరి బాలకృష్ణ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 Telugu Hero Balakrishna Giving Slap To The Young Hero-అందుకే బాలయ్య బాబు ఆ హీరోని ఇంటికి పిలిచి చెంప చెల్లుమనిపించాడట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే అప్పట్లో నందమూరి బాలకృష్ణ వయసు గురించి ఓ యంగ్ హీరో తనతో కలసి నటిస్తున్న హీరోయిన్ తో కామెంట్ చేశాడని, దీంతో ఆ విషయం తెలుసుకున్న బాలయ్య బాబు ఆ హీరోని పిలిపించి చెంప చెళ్లుమనిపించడమే కాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట.

మరోమారు ఇలాంటివి జరిగితే బాగోదని, అలాగే సినిమా పరిశ్రమలో క్రమశిక్షణ, వినయం, విధేయత వంటివి చాలా ముఖ్యమని ఆ హీరోకి సూచించాడట.దాంతో అప్పటి నుంచి ఆ హీరో కి బాలయ్య బాబు కి మధ్య మాటలు లేవట.

కానీ ఆ మధ్య ఆ హీరో తమ్ముడు అనుకోకుండా వివాదాల్లో చిక్కుకొని పోలీసులు అరెస్టు చేయడంతో బాలయ్య బాబు అసలు విషయం తెలుసుకుని హీరోకి సహాయం చేసినట్లు కూడా సమాచారం.కానీ ఆ హీరో పేరు మాత్రం ఇప్పటికీ బయటికి రాలేదు.

దీంతో బాలయ్య బాబు మాట తీరు, ప్రవర్తన కొంచెం కఠినంగానే ఉన్నప్పటికీ మనసు మాత్రం వెన్న పూసని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తెలుగులో “అఖండ” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

కాగా చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య బాబుకి జోడీగా కంచె మూవీ ఫేమ్ “ప్రగ్యా జైస్వాల్” నటిస్తోంది.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.కాగా ఈ చిత్రాన్ని స్వర్గీయ నటుడు నందమూరి తారక రామారావు జయంతి రోజున విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావించినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితులు కారణంగా విడుదల మరింతకాలం వాయిదా పడినట్లు తెలుస్తోంది.

#TeluguHero #Balakrishna #BalakrishnaSlap #AkhandaMovie #Tollywod

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు