సునీల్‌ ఇన్నాళ్లకు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు

సునీల్‌ కమెడియన్‌ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు చాలా కష్టపడ్డాడు.త్రివిక్రమ్‌ సినిమా ల్లో చాన్స్‌ మరియు ఇతరత్ర కారణాల వల్ల అనూహ్యంగా సునీల్‌ స్టార్‌ కమెడియన్ గా గుర్తింపు దక్కించుకున్నాడు.

 Telugu Hero And Comedian Sunil Has Taking Good Decisions In Choosing Movies, Com-TeluguStop.com

కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలో సునీల్‌ హీరోగా మారాడు.సరే హీరోగా ఆఫర్లు వస్తున్న సమయంలో చేయడం లో తప్పు లేదు.

గతంలో చాలా మంది కమెడియన్స్ హీరోలుగా చేయడం జరిగింది.కాని వారిలో చాలా మంది హీరోలుగా చేస్తూనే కమెడియన్‌ గా కూడా కొనసాగారు.

అందువల్ల వారు హీరోలుగా సక్సెస్‌ కాకుంటే కమెడియన్స్ గా కొనసాగారు.కాని సునీల్‌ మాత్రం హీరోగా ఆఫర్లు వస్తున్న సమయంలో మరో హీరోతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించలేదు.

ఒకానొక సమయంలో సునీల్‌ నాలుగు అయిదు పెద్ద హీరోల సినిమా లను వదిలేశాడు అంటూ వార్తలు వచ్చాయి.హీరోగా కొన్నాళ్ల పాటు అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత మొత్తం తలకిందులు అయ్యింది.

హీరోగా ఆఫర్లు రాకపోవడంతో మళ్లీ కమెడియన్‌ గా చేసేందుకు సిద్దం అయ్యాడు.కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో కొన్ని సినిమా ల్లో మళ్లీ హీరోగా నటించేందుకు ఆఫర్లు వచ్చాయి.

కాని ఆ సమయంలో హీరోగా నటించేందుకు ఒప్పుకోలేదు.మొత్తంగా సునీల్‌ హీరోగా చేసేప్పుడు కమెడియన్‌ గా.కమెడియన్ గా చేసేప్పుడు హీరోగా చేసేందుకు సిద్దపడలేదు.అది చాలా తప్పుడు నిర్ణయం అంటూ ఇప్పుడు తెలుసుకున్నట్లుగా ఉన్నాడు.

అందుకే ఇప్పుడు వరుసగా హీరోగా చేస్తూనే కమెడియన్‌ గా కూడా నటిస్తున్నాడు.అలా సునీల్‌ కెరీర్ లో ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ఎత్తున సునీల్‌ కు ఆఫర్లు వస్తున్నాయి.ఇన్నాళ్లకు అయినా మంచి నిర్ణయం తో ముందుకు వెళ్తున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube