తెలుగులో ప్రముఖ కమెడియన్ గా మరియు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆలీ గురించి సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఆలీఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పలురకాల షోలు ఈవెంట్లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తున్నాడు.
కాగా తాజాగా అలీ కూతురు బేబీ జువేరియ కి సినిమాల్లో నటించడం పట్ల చాలా ఆసక్తి ఉండడంతో ఈ మెని తొందర్లోనే తెలుగు వెండి తెరకు పరిచయం చేస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అయితే ఇందులో భాగంగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బాల నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన “మా గంగానది” అనే చిత్రంలో బేబీ జువెరియ నటిస్తూ తెలుగు సినీ పరిశ్రమకి బాల నటిగా పరిచయం కాబోతోంది.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కూడా ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే విడుదల చేశారు.అయితే ఈ చిత్రంలో ఆలీ న్యాయం కోసం పోరాటం చేసే లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.
దీంతో ఈ విషయం గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో కొందరు నెటిజన్లను బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.అంతేగాక మరికొంత మంది ఆలీ అభిమానులు జవేరియ సినిమాల్లో బాగా రాణించాలని అంటూ గ్రాండ్ గా వెల్ కమ్ చెబుతున్నారు.
అయితే ఈ చిత్ర ట్రైలర్ ను ఒక్కసారి పరిశీలించినట్లయితే ఈ చిత్రంలో టెక్నాలజీ అతిగా వాడడం వల్ల జరిగే అనర్ధాలు మరియు పసిపిల్లలు, మహిళలపై జగుతున్న అత్యాచారాలు తదితర అంశాలపై ఏదో మెసేజ్ ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.దీంతో ఈ చిత్రంపై ప్రస్తుతం బాగానే అంచనాలు మరియు ఆసక్తి నెలకొన్నాయి.
అలాగే ఈ చిత్ర విడుదల తేదీ గురించి చిత్ర యూనిట్ సభ్యులు స్పందిస్తూ తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని తెలియజేస్తామని తెలిపారు.