రెండో పెళ్లి గురించి స్పందించిన సుమంత్...ఆ వెడ్డింగ్ కార్డ్ తనదేనట....

మామూలుగా సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ విషయం బయటకు పొక్కిందంటే చాలు కొంత మంది నిజానిజాలు తెలుసుకోకుండా వారి గురించి కథలు కథలుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు.తాజాగా అక్కినేని హీరో సుమంత్ అక్కినేని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు అంతేగాక ఇప్పటికే తన కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలుపెట్టి పెళ్లి పత్రికలు కూడా అచ్చు వేయించారని జోరుగా ప్రచారం సాగుతోంది.

 Telugu Hero Akkineni Sumanth React About His Second Marriage And Wedding Card-TeluguStop.com

దీనికితోడు ఇటీవల సుమంత్ పేరుతో పెళ్లి కార్డు కూడా వైరల్ అవుతుండడంతో తాజాగా అక్కినేని సుమంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయం గురించి స్పందించారు.

ఇందులో భాగంగా ఈ మధ్య తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయని కానీ తన నిజ జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

 Telugu Hero Akkineni Sumanth React About His Second Marriage And Wedding Card-రెండో పెళ్లి గురించి స్పందించిన సుమంత్…ఆ వెడ్డింగ్ కార్డ్ తనదేనట….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే తాను ప్రస్తుతం ఓ తెలుగు చిత్రంలో హీరోగా నటిస్తున్నానని అయితే ఈ చిత్రంలో తాను విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకునే వ్యక్తి పాత్రలో నటిస్తున్నానని ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపాడు.అయితే ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన పెళ్లి పత్రిక లీక్ కావడంతో అందరూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనుకున్నారని అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాడు.

అంతేకాకుండా తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తామని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సుమంత్ అక్కినేని తెలుగులో “అనగనగా ఒక రౌడి” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు మను యజ్ఞ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత గార్లపాటి రమేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#TeluguHero #AnaganagaOka #SumanthSecond #Second Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు