వినూత్న రీతిలో చిత్రాలను చిత్రిస్తున్న తెలుగు యువతి..!

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ దాగుంటుంది.ఏదో ఒక రూపంలో అది బయటపడుతుంది.

 Telugu Girl Painting Pictures In An Innovative Way , Painting , Viral Latest ,-TeluguStop.com

సన్నాయితో సినిమా మ్యూజిక్ ని వాయించిన వారిని చూసాం.కొంత మంది మ్యాజిక్ చేస్తుంటారు.

మరికొంత మంది తమ శరీరాన్ని విల్లులా మలిచి విన్యాసాలు చేస్తుంటారు.అలానే నెల్లూరు జిల్లాకు చెందిన ఉజ్వల లో కూడా ఓ అరుదైన కళ దాగుంది.

చిన్ననాటి నుండి పెయింటింగ్స్, చిత్రాలు గీయడంపై ఆసక్తి చూపిన ఉజ్వల.తాజాగా, గణతంత్ర దినోత్సవ సందర్భంగా రావి ఆకులపై స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను గీసి అరుదైన రికార్డు నెలకొల్పింది.

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉజ్వల.మన భారతదేశ పటం ఆకారంలో మొత్తం 73 మంది స్వాతంత్య్ర సమర యోధుల చిత్రాలను.73 రావి ఆకులపై గీసి వారికి నివాళి అర్పించింది.ఈ చిత్రాలన్నింటిని గీయడానికి ఆమెకు 9 గంటలకు పైగా సమయం పట్టింది.

దీని కోసం ఆమె నెల్లూరుకు చెందిన అమీర్ ఆర్ట్ అకాడమీలో శిక్షణ కూడా తీసుకుంటోంది.అయితే. రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె గీసిన చిత్రాలు ఇప్పుడు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.దీని ద్వారా ఆమె ప్రపంచ రికార్డు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

ఇదే కాక.మున్ముందు మరిన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తానని తెలిపింది.

ఈ సందర్భంగా ఉజ్వల మాట్లాడుతూ.నాకు చిన్నపటి నుండి చిత్రలేఖనం అంటే ఇష్టం.అందుకే దాని మీద ఇష్టంతో నేను గత కొన్ని సంవత్సరాలుగా డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను.నేను నేర్చుకున్న కళను నలుగురికి చుపించాలనిపించింది.

అందుకే 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 73 రావి ఆకులపై 73 మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు వేశాను అని ఆమె తెలిపారు.రావి ఆకులపై ఆమె గీసిన చిత్రాలను చూసి పలువురు.

ఉజ్వలను అభినందిస్తున్నారు.

Telugu Girl Painting Pictures In An Innovative Way , Painting , Viral Latest , Viral News , Social Media , Nellore Girl , Repubic Day , Painting ,drawing - Telugu Nellore, Repubic Day, Latest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube