పాపం..  ఒకప్పటి ఈ యాంకర్ అందుకే ఆత్మహత్య చేసుకుందట…   

Telugu Former Anchor Radhika Reddy Suicide news, Radhika Reddy, Telugu Former Anchor, Suicide news, Tollywood - Telugu Radhika Reddy, Suicide News, Telugu Former Anchor, Telugu Former Anchor Radhika Reddy Suicide News, Tollywood

తెలుగులో తన మధురమైన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ స్వర్గీయ యాంకర్ రాధిక రెడ్డి గురించి తెలుగు  ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఈమె తెలుగు లోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో పురాతన ఆలయాల ప్రతిష్ఠతలు మరియు వాటి యొక్క విశిష్టతను ప్రేక్షకులకు తెలియజేస్తూ చేసినటువంటి ప్రోగ్రామ్స్ మంచి గుర్తింపు తెచ్చాయి.

TeluguStop.com - Telugu Former Anchor Radhika Reddy Suicide News

 అయితే అనుకోని విధంగా నటి రాధికా రెడ్డి ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం అప్పట్లో పెను సంచలనంగా మారింది.

అయితే ఆమె మృతి చెందిన రోజు ఎప్పటిలాగే యాంకర్ రాధికా రెడ్డి తన విధులను ముగించుకొని ఆఫీసు నుండి ఇంటికి వచ్చి తాను మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి తాను నివాసం ఉంటున్న ఇంటి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

TeluguStop.com - పాపం..  ఒకప్పటి ఈ యాంకర్ అందుకే ఆత్మహత్య చేసుకుందట… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో పోలీసుల విచారణలో మాత్రం ఆమె కాల్ డేటాను పరిశీలించి పలు సంచలన నిజాలు బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే ఇందులో తరచూ యాంకర్ రాధిక రెడ్డి కి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ రావడంతో ఆమె అప్పుడప్పుడు కొంతమేర ఆందోళనకు గురవుతుందని అంతేగాక ఆమె ఆత్మహత్య చేసుకున్న రోజు కూడా  ఆ గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని పోలీసులు కనుగొన్నారు.

  ఆ తర్వాత ఏమైందనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి ఆరు నెలల ముందు తన భర్త నుంచి విడాకులు తీసుకుంది.

 దీంతో పోలీసులు ఆ కోణంలో విచారణ జరిగినప్పటికీ రాధిక రెడ్డి ఆత్మహత్య కి తన భర్త కు ఎలాంటి సంబంధం లేదని కనుగొన్నారు.

#Radhika Reddy #TeluguFormer #TeluguFormer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Former Anchor Radhika Reddy Suicide News Related Telugu News,Photos/Pics,Images..