పాపం.. ఈ సీనియర్ నటి తన చివరి రోజుల్లో నటన కోసం…  

telugu Former Actress Suryakantam last days news, Suryakantam, Telugu Former Actress, Senior actress, Tollywood, - Telugu Senior Actress, Suryakantam, Telugu Former Actress, Telugu Former Actress Suryakantam Last Days News, Tollywood

ఒకప్పుడు గయ్యాలి అత్త, పెంకి పెళ్ళాం, ఇలాంటి పాత్రలను తలుచుకుంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది స్వర్గీయ సీనియర్ నటి సూర్యకాంతం. అయితే ఈమె నటించినటువంటి ఎక్కువ చిత్రాల్లో గయ్యాళి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

TeluguStop.com - Telugu Former Actress Suryakantham Last Days News

 ఎంతలా అంటే ఇప్పటికీ ఆమె పాత్రని ఎవరూ మైమరిపింప చేయలేకపోయారు.అయితే సూర్యకాంతం తన తల్లిదండ్రులకి 14వ సంతానం.

 ఈమెకి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి కలగడంతో పెద్దగా చదువుకోకపోయినప్పటికీ నటి కావాలని కోరిక మాత్రం బాగానే ఉండేది.ఆ కారణంగానే తన తల్లిదండ్రులను పట్టుబట్టి మరీ ఒప్పించి తమిళనాడులోని చెన్నై కి వెళ్లి జెమినీ టీవీ లో నటించే అవకాశాలను దక్కించుకుంది.

TeluguStop.com - పాపం.. ఈ సీనియర్ నటి తన చివరి రోజుల్లో నటన కోసం…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అయితే అప్పట్లో నటి  సూర్యకాంతం కి  నెలసరి వేతనం 65 రూపాయలు మాత్రమే ఇచ్చే వారు.

అయితే ఈ డబ్బుతో తన కుటుంబం గడవడం కష్టంగా ఉండడంతో అప్పుడప్పుడు పలు చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేది.

ఈ క్రమంలో తనకి  ఓ తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో హీరోయిన్ గా నటించే లేకపోయింది. దీంతో ఆ అవకాశం వేరే నటి కి దక్కింది.

కానీ చిత్ర యూనిట్ సభ్యులు నటి సూర్యకాంతం పై ఉన్న మమకారంతో ఆ చిత్రంలో హీరోయిన్ గా సూర్యకాంతమ్మ నటించాలని పట్టుబట్టినప్పటికీ నటి సూర్యకాంతం మాత్రం ఇతరుల జీవితాల్లోని సుఖాల్ని దూరం చేసే అవకాశం తనకు వద్దంటూ ఆ నటిని తమ చిత్రంలో నటింపజేయాలని వారిని కోరింది.అయితే ఆ రోజు ఆమె తీసుకున్నటువంటి ఆ నిర్ణయమే మనకి ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ  గయ్యాళి సూర్యకాంతం గురించి పరిచయం చేసింది.

అయితే సూర్యకాంతమ్మ వృత్తి పరంగా గయ్యాళి పాత్రలో నటించినప్పటికీ ఆమె ఎంతో సున్నిత మనస్తత్వం  మరియు సహృదయం కలిగినటువంటి నటి అని ఇప్పటికీ చాలామంది నటీనటులు అంటుంటారు. అయితే సినిమాలపై ఉన్నటువంటి గౌరవంతో సూర్యకాంతమ్మ తన చివరి శ్వాస విడిచే వరకు వచ్చినటువంటి అవకాశాలను కాదనకుండా నటించింది.

చివరగా 1996 వ సంవత్సరంలో కన్ను మూసింది.

#Suryakantam #TeluguFormer #TeluguFormer #Senior Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Former Actress Suryakantham Last Days News Related Telugu News,Photos/Pics,Images..