ఈ హీరోయిన్ పొగరు వల్ల తన సినీ కెరియర్ ని చిక్కుల్లో పడేసుకుని ... చివరికి ...

ఒకప్పటి తెలుగు ప్రముఖ స్వర్గీయ నటి మరియు వెటరన్ హీరోయిన్ సిల్క్ స్మిత చిత్రాలు మరియు ఆమె డాన్స్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.ఇప్పటికీ సిల్క్ స్మిత నటించిన “బావలు సయ్యా”  అనే పాట సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది.

 Telugu Former Actress Silk Smitha Real Life And Death News,  Silk Smitha, Telugu-TeluguStop.com

 అయితే సిల్క్ స్మిత వచ్చీ రావడంతోనే తన అందచందాలతో బాగానే ఆకట్టుకోవడంతో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, భోజపూరి  తదితర భాషలలో తనకంటూ కొంతమంది కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.

 ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందినటువంటి సిల్క్ స్మిత అనుకోకుండా ఆత్మహత్య చేసుకుని మరణించడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది.

అయితే సిల్క్ స్మిత కి సినిమా పరిశ్రమలో స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత పారితోషికం విషయంలో పెద్దగా శ్రద్ధ చూపలేకపోయిందని అంతేగాక దర్శక నిర్మాతల పట్ల ప్రవర్తించే తీరు కూడా చాలామందికి నచ్చకపోవడంతో ఆమెని వ్యక్తిగతంగా దూరం పెట్టారని కొందరు చర్చించుకుంటున్నారు.

 దీనికితోడు సిల్క్ స్మిత అప్పుడప్పుడు మద్యం సేవించి, ధూమపానం చేస్తూ సినిమా షూటింగ్ వచ్చేదని ఈ క్రమంలో ముద్దు సన్నివేశాలలో ఆమెతో నటించే హీరోలు మరియు తోటి నటీనటులు కొంతమేర అసౌకర్యంగా ఫీలవుతూ మరోమారు ఇలాంటి సందర్భాలు ఎదురయితే ఆమెతో నటించమని దర్శక నిర్మాతలతో చాలా సార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Telugu Bavalu Sayya, Silk Smitha, Telugu Actress, Teluguactress, Tollywood-Movie

అయితే వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో సిల్క్ స్మిత నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని నిర్మించింది.దీంతో ఆమె దగ్గర ఉన్న డబ్బు అయిపోవడంతో అప్పులు తెచ్చి మరి ఈ సినిమాని పూర్తి చేసినప్పటికీ ఆ చిత్రం విడుదల కాలేదు. దీంతో ఒకపక్క మానసికపరమైన సమస్యలు, మరోపక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

దీంతో కొందరు విశ్లేషకులు సిల్క్ స్మిత నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ నిర్మాతగా మారి అనవసరం అయినటువంటి సమస్యలను కొని తెచ్చుకుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా సిల్క్ స్మిత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బోజ్పురి, తదితర భాషలలో కలిపి దాదాపుగా 450 చిత్రాలలో పైగా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

అయితే ఆ మధ్య సిల్క్ స్మిత జీవిత గాథ ఆధారంగా “ది డర్టీ పిక్చర్” అనే సినిమాని కూడా తీశారు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube