సినీ పరిశ్రమకి వచ్చిన మొదట్లో వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్న తర్వాత అనుకోకుండా కనుమరుగైన హీరోయిన్లు సినీ పరిశ్రమలో ఎందరో ఉన్నారు.తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “బొబ్బిలి రాజా” అనే చిత్రంతో హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయినటువంటి ప్రముఖ స్వర్గీయ నటి “దివ్య భారతి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈమె తెలుగులో నటించింది కొన్ని చిత్రాలే అయినప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది.అయితే తెలుగులో దివ్య భారతి విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, తదితర స్టార్ హీరోల సరసన నటించి అప్పట్లోనే స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.
ఈ క్రమంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమపై మనసు మళ్లడంతో అక్కడికి మకాం మార్చింది.అయితే బాలీవుడ్ లో కూడా వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకొని ఇక్కడ కూడా బాగానే రాణించింది.
వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో సాజిద్ అనే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కానీ అనుకోకుండా తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో దివ్య భారతితో పాటూ అక్కడే ఉన్న ఆమె స్నేహితురాలు కూడా ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
కానీ ఇప్పటి వరకు అసలు నటి దివ్యభారతి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయంపై సరైన స్పష్టత లేదు.
అంతేగాక ఆమె ఆత్మహత్య చేసుకున్న ఐదు సంవత్సరాల తర్వాత సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు కూడా కేసును కొట్టివేశారు.ఈ విషయంలో నటి దివ్యభారతి తెలుగు హిందీ కన్నడ తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
ఇందులో తెలుగులో తొలి ముద్దు, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు, ధర్మక్షేత్రం, తదితర చిత్రాలు తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఏదేమైనప్పటికీ అతి పిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ హోదా ను దక్కించుకుని దూసుకుపోతున్న నటి ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సినిమా పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది.