భర్త మరణం తర్వాత ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా...?

తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చి వరుస హిట్లను అందుకని స్టార్ హీరోగా వెలుగొందిన ప్రముఖ స్వర్గీయ నటుడు ఉదయ్ కిరణ్ గురించి సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఒకప్పుడు ఉదయ్ కిరణ్ పలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

 Telugu Former Actor Uday Kiran Wife Vishuitha Kiran News-TeluguStop.com

ఈ క్రమంలో వరుస సినిమా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న “విషిత” ని ఉదయ్  కిరణ్ ని పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లయిన తర్వాత వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు.

 Telugu Former Actor Uday Kiran Wife Vishuitha Kiran News-భర్త మరణం తర్వాత ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ పెళ్లయిన కొన్ని రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ కి వరుస సినిమా ప్లాప్ లు చుట్టుముట్టాయి.ఈ క్రమంలో సినిమాల పరంగా అవకాశాలు కరువయ్యాయి.

దీంతో మానసికంగా కుంగిపోయిన సమయంలో అనుకోకుండా తన ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఉన్నట్లుండి  ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడంతో విషిత కిరణ్ జీవితంలో ఒక్కసారిగా కష్టాలు మొదలయ్యాయి.

దీంతో విషిత ప్రస్తుతం ఓ ప్రముఖ  సాఫ్ట్ వేర్ సంస్థలో ఇంజనీర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే ఉదయ్ కిరణ్ మరణాంతరం విషిత పూర్తిగా బయటకు రావడం మానేసింది.

పెళ్లయిన రెండు సంవత్సరాల కాలంలోనే భర్తని పోగొట్టుకొని విషిత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.ప్రస్తుతం విషిత తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివాసముంటున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య విషయంపై స్పందిస్తూ అతడికి తనతో పాటు సరి సమానంగా కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను తన తల్లిదండ్రులు ఇచ్చారని కాబట్టి ఉదయ్ కిరణ్ కి ఆర్థికపరమైన సమస్యలేమీ లేవని స్పష్టం చేసింది.అంతేగాక ఉదయ్ కిరణ్ మరణాంతరం అతడి భార్య విషిత కిరణ్ తమతో మాట్లాడటం పూర్తిగా మానేసిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఏదేమైనప్పటికీ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించిన ఉదయ్ కిరణ్ తన జీవితంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగానే ఆత్మహత్య చేసుకోవాల్సిన వచ్చిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#TeluguFormer #TeluguFormer #VishuithaKiran #Uday Kiran #UdayKiran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు