అలాంటి హీరోయిన్లకి ముద్దు పెట్టాలంటే చాలా కంపరంగా ఉంటుందట...  

మామూలుగా సినిమా పరిశ్రమ అంటే రంగుల పరిశ్రమ అని ఇక్కడ మనసుతో పాటు ముఖానికి వేసుకునేటువంటి రంగులు చాలా ముఖ్యమని అప్పట్లో ఓ మహానుభావుడు చెప్పాడు.అయితే ఈ సినిమా పరిశ్రమని ఎంతో మంది కష్ట పడి పనిచేసి అభివృద్ధి చేశారు.

TeluguStop.com - Telugu Former Actor Akkineni Nageswara Rao Sensational Comments Kiss Scenes

అప్పట్లో మద్రాసులో ఉన్నటువంటి చలన చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కి తరలించడానికి  కృషి చేసినటువంటి వారిలో ప్రముఖ స్వర్గీయ నటుడు మరియు సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు.అక్కినేని నాగేశ్వరావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చేసినటువంటి సేవలు మరువలేనివి.

అయితే తాజాగా అక్కినేని నాగేశ్వరరావు (బ్రతికి ఉన్నప్పుడు) అప్పట్లో పాల్గొన్నటువంటి ఓ ఇంటర్వ్యూలో తాను నటిస్తున్న సమయంలో ఎదుర్కున్న అనుభవాల గురించి చెప్పిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో అక్కినేని నాగేశ్వర రావు ఉదయం సమయంలో షూటింగ్ జరిగే టప్పుడు కొందరు హీరోయిన్లు కనీసం పళ్ళు కూడా తోముకోకుండా కేవలం మేకప్ వేసుకొని ముద్దు సన్నివేశాల్లో నటించేవారని చెప్పుకొచ్చాడు.

TeluguStop.com - అలాంటి హీరోయిన్లకి ముద్దు పెట్టాలంటే చాలా కంపరంగా ఉంటుందట…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ సమయంలో వారితో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా కంపరంగా ఉండేదని తెలిపాడు.దీంతో ఒక్కోసారి అలాంటి హీరోయిన్ల అసిస్టెంట్లను పిలిచి మరి సినిమా షూటింగ్ లో పాల్గొనేటప్పుడు శుభ్రంగా ఉండమని చెప్పండని చెప్పిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని తెలిపాడు.

 అలాగే పని ఏదైనా సరే పరిశుభ్రత, క్రమశిక్షణ, ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా అక్కినేని నాగేశ్వర రావు అప్పట్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు.

 అంతేగాక తన తుది శ్వాస విడిచే వరకు కూడా నటన కోసం ఎంతో కృషి చేశాడు. కాగా చివరగా తెలుగులో ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన “మనం” అనే చిత్రంలో నటించాడు.

చివరికి 2013వ సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖున క్యాన్సర్ కారణంగా కన్ను మూసాడు.

#KissScenes #TeluguFormer #TeluguFormer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Former Actor Akkineni Nageswara Rao Sensational Comments Kiss Scenes Related Telugu News,Photos/Pics,Images..