ఈసారి మార్చిలో కూడా సందడే సందడి, సమ్మర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డబుల్‌- Telugu Films Coming For This Summer In March

telugu films coming for this summer in march , acharya, liger, mosagallu, srikaram, summer movies, tollywood movie - Telugu Acharya, Liger, Mosagallu, Srikaram, Summer Movies, Tollywood Movie

ప్రతి సంవత్సరం కూడా మార్చిలో పరీక్షల కారణంగా పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు కూడా విడుదలకు ఆసక్తి చూపించవు.కాని ఈసారి పరిస్థితి వేరుగా ఉంది.

 Telugu Films Coming For This Summer In March-TeluguStop.com

ఈ సారి మార్చిలో పరీక్షలు ఏమీ ఉండటం లేదు.కనుక సమ్మర్‌ సీజన్ మార్చి నుండే ప్రారంభం కాబోతుంది.

మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌ మొదటి వారంలో సినిమాలు విడుదల ఉంటుంది.సమ్మర్ సీజన్ అనేది టాలీవుడ్ కు ఏప్రిల్‌ నుండి జూన్ వరకు కొనసాగుతుంది.

 Telugu Films Coming For This Summer In March-ఈసారి మార్చిలో కూడా సందడే సందడి, సమ్మర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డబుల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఈసారి మాత్రం మార్చి నుండి జులై వరకు సమ్మర్‌ సినిమాల జోరు కొనసాగే అవకాశం ఉంది.వరుసగా సినిమాలే సినిమాలు.

గత ఏడాదిలో విడుదల కాలేని సినిమాలు ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు అన్ని కూడా సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.కనుక ఈ ఏడాది సినిమా సినిమాలతో ప్రేక్షకులు పండుగ చేసుకోవచ్చు.

ప్రస్తుతం సినిమాలు ఒకొక్కటిగా విడుదల అవుతున్నాయి.కాని మార్చి నుండి వరుస పెట్టబోతున్నాయి.ఎందుకంటే మార్చి వరకు కరోనా మరింతగా తగ్గడంతో పాటు థియేటర్లు పూర్తి స్థాయి లో నడిచే అవకాశం ఉంది.కనుక మార్చి నుండి పెద్ద సినిమాలు చిన్న సినిమాలు వరుసగా విడుదల అవుతాయని అంటున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాలు అన్ని కూడా ఈ సమ్మర్ లో విడుదల కాబోతున్నాయి.మంచు విష్ణు ‘మోసగాళ్లు‘ సినిమా మొదలుకుని కేజీఎఫ్‌ సినిమా వరకు సమ్మర్ లోనే విడుదలకు సిద్దం అవుతున్నాయి.

మార్చి 11వ తారీకున మోసగాళ్లు మరియు శర్వానంద్‌ శ్రీకారం విడుదల కాబోతున్నాయి.ఈ రెండు సినిమాలు అధికారికంగా విడుదల తేదీలను ప్రకటించారు.

కాని ఇతర సినిమాల విడుదల తేదీల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఆచార్య, వకీల్ సాబ్‌ ఇంకా పలు సినిమాలు కూడా సమ్మర్ లో వస్తాయని అంటున్నారు.

సమ్మర్‌ నుండి మొదలుకుని దసరా వరకు సినిమాల జాతర కొనసాగబోతుంది.నెలలో కనీసం పది సినిమాలకు మించి వస్తాయని అంటున్నారు.

#Liger #Srikaram #Summer Movies #Acharya #Mosagallu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు