బయ్యర్ల డిస్టిబ్యూటర్ల ఆందోళన ఫలించినట్లేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలు సినిమాలు ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్న సమయంలో తెలంగాణ సినిమా నిర్మాతల సంఘం తో పాటు పలువురు డిస్ట్రిబ్యూటర్లు మరియు బయ్యర్లు సినిమా లను ఓటీటీకి ఇవ్వద్దంటూ విజ్ఞప్తి చేశారు.అక్టోబర్ వరకు ఓటీటీ కి వెళ్లకుండా వెయిట్‌ చేయాలంటూ వారు చేసిన విజ్ఞప్తి పని చేసినట్లుగా అనిపిస్తుంది.

 Telugu Film Producers Said Not Going To Ott  , Film News, News In Telugu, Telugu-TeluguStop.com

ఆ మద్య వరుసగా నారప్ప మరియు దృశ్యం 2 సినిమా లు ఓటీటీ కి వెళ్లాయి.ఆ తర్వాత మాత్రం మళ్లీ ఓటీటీ ప్రస్థావన కనిపించడం లేదు.

చిన్నా పెద్ద సినిమాలు అన్ని కూడా థియేటర్‌ రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బయ్యర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు విజ్ఞప్తి మేరకు కొన్ని రోజుల వరకు సినిమా ల ఓటీటీ విడుదల విషయమై నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లుగా చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఈ నెల చివరి నుండి పూర్తి స్థాయిలో నడుస్తాయని అంటున్నారు.ఇప్పటికే థియేటర్లపై ఉన్న ఆంక్షలు అన్నింటిని కూడా తొలగించడం జరిగింది.కనుక ఏ సమయంలో అయినా నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్‌ అవుతాయని అంతా నమ్మకంగా ఉన్నారు.ఇక ఇప్పటికే ఆగస్టులో సినిమాల విడుదలకు కొందరు నిర్మాతలు సిద్దం అవుతున్నారు.

కనుక ఓటీటీ కి వెళ్లాల్సిన అవసరం రాలేదు అంటూ కొందరు అంటున్నారు.

Telugu Buyers, Distributors, Drushyam, Ppa, Telugu, Theaters, Tollywood-Movie

మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమ లోని కొందరి రిక్వెస్ట్‌ కారణంగా పెద్ద మొత్తం లో సినిమా లు ఓటీటీ దారి పట్టకుండా నిలిచి పోయాయి అంటున్నారు.హిందీ పరిశ్రమ లో ఎన్నో సినిమా లను ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు.తెలుగు వారికి కూడా ఆఫర్లు వస్తున్నా థియేటర్ల ను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో వారు వాటికి నో చెబుతున్నారని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube