టాలీవుడ్‌ నిర్మాతలు ఏటీటీ వెంట పడటానికి కారణం ఇదేనా?  

టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఏటీటీ పదం వినిపిస్తుంది.ఎందుకంటే ఓటీటీ అంటే సినిమా హిట్‌ అయిన ప్లాప్‌ అయినా నిర్మాతలకు వచ్చేది ఒక్కటే.

TeluguStop.com -  Telugu Film Producers Going To Start Att Very Soon

కాని ఏటీటీ అంటే థియేటర్‌ లో విడుదల చేసిన మాదిరిగా అన్నమాట.ఇప్పటికే వర్మ తన చాలా సినిమాలను ఏటీటీలో విడుదల చేశాడు.

ఇప్పుడు అలాగే ఇతర నిర్మాతలు కూడా తమ సినిమాలను ఏటీటీలో విడుదల చేయాలని ఉవ్విల్లూరుతున్నారు.ఏటీటీ పద్దతిలో అయితే సినిమాకు టికెట్‌ రేటు పెట్టవచ్చు.

TeluguStop.com - టాలీవుడ్‌ నిర్మాతలు ఏటీటీ వెంట పడటానికి కారణం ఇదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ పై టికెట్‌ పెట్టి విడుదల చేయడం అంటే ఖచ్చితంగా అదో పెద్ద ప్రయోగంగా చెప్పుకోవచ్చు.ఇప్పటి వరకు వర్మ బోల్డ్‌ సినిమాలు మాత్రమే అలా వచ్చాయి.

ఇప్పుడు మొదటి సారి ఒక ప్రముఖ నిర్మాత నుండి ఆ పద్దతిలో సినిమా రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు ఇద్దరు కలిసి ఏటీటీని ప్రారంభించబోతున్నారు.ఎనీ టైమ్‌ థియేటర్‌.దీని ద్వారా వరుసగా సినిమాలను విడుదల చేయాలని వారు భావిస్తున్నారు.

ఓటీటీలో ఏడాదికి ఒక్కసారి చందా కట్టి అందులో వచ్చే ప్రతి సినిమాను చూడవచ్చు.కాని వీరు మాత్రం సినిమాను థియేటర్లలో విడుదల చేసిన సమయంలో ఎలా అయితే టికెట్‌ ను తీసుకుని వెళ్లాల్సి ఉంటుందో అలాగే ఈ పద్దతిలో వెళ్లాల్సి ఉంటుంది.

అంటే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు థియేటర్ల ఓపెన్‌ కు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి.వచ్చే ఏడాది వరకు థియేటర్లు ఓపెన్‌ అయ్యే అవకాశం లేదు.

భవిష్యత్తు కూడా ఎలా ఉంటుంది అనే విషయంలో క్లారిటీ లేదు.అందుకే ఓటీటీలకు సమాంతరంగా ఏటీటీలు కూడా ప్రారంభం అవ్వాలి.

అలా ప్రారంభం అయితే నిర్మాతలకు కాస్త అయినా ఊరట దక్కుతుంది అనేది కొందరి అభిప్రాయం.ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న డర్టీ హరి సినిమా ఏటీటీ ద్వారా వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఏటీటీలో మొదట విడుదల చేసి ఆ తర్వాత ఓటీటీకి ఇస్తారు.దాన్ని శాటిలైట్‌ కు కూడా అమ్మేస్తారు.ఇలా మూడు రకాలుగా నిర్మాతలకు బిజినెస్‌ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు