తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ప్రముఖ సినీ నిర్మాత “సి.కళ్యాణ్” గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.కాగా తాజాగా నిర్మాత సి.కళ్యాణ్ పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో కలెక్షన్ల పేరుతో జరుగుతున్న మోసాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవలే తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శక నిర్మాతలు ఆంధ్ర ప్రదేశ్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని ని కలిశారు.ఇందులో భాగంగా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించే విషయంపై చర్చించారు.
అయితే ఈ విషయంపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఇటీవలే విడుదలైన కొన్ని చిత్రాల కలెక్షన్ల గురించి మాట్లాడుతూ ఒక్కో సినిమా దాదాపుగా 20 నుంచి 50 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసిందని చిత్ర యూనిట్ సభ్యుల ప్రచారాలు చేస్తున్నారని అలాంటప్పుడు సినిమాలకి నష్టం ఎలా వస్తుందంటూ ప్రశ్నలు సంధించారు.దీంతో సినీ నిర్మాత సి.కళ్యాణ్ ఈ విషయంపై స్పందిస్తూ కొంతమంది సినిమాలపై హైప్ పెంచేందుకు కలెక్షన్ల విషయంలో అబద్ధాలు చెబుతున్నారని అంతే తప్ప అందులో ఎలాంటి వాస్తవాలు లేవని తెలియజేశాడు.ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న సినిమాల చిత్ర యూనిట్ సభ్యులు తమ చిత్రాల ప్రమోషన్స్ లో అవాస్తవాలను తెలియజేస్తూ ప్రమోట్ చేసుకుంటున్నారని కానీ వాస్తవ కలెక్షన్ల విషయానికి వచ్చేసరికి కి చాలా తేడా వస్తుందని అందువల్ల చిన్న సినిమాల నిర్మాతలు నష్ట పోతున్నారని తెలిపాడు.
దీంతో ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు మంత్రి పేర్ని నాని సినీ నిర్మాతలు మరియు థియేటర్ల యాజమాన్యాలతో చర్చించినట్లు సమాచారం.అయితే ఏదేమైనప్పటికీ కలెక్షన్ల గురించి అవాస్తవ ప్రచారం చేయడంతో కొందరు ప్రజలు నమ్మి సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళుతున్నట్లు కూడా తెలుస్తోంది.