ఆ దర్శకుడికి సినిమా అంటే గౌరవం లేదు... అందుకే...

తెలుగులో గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ తదితర బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన టాలీవుడ్ ప్రముఖ నటుడు బండ్ల గణేష్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే మొదటగా బండ్ల గణేష్ ఎలాంటి సినిమా కుటుంబ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించాడు.

 Telugu Film Producer Bandla Ganesh Sensational Comments On Director-TeluguStop.com

 ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ఆంజనేయులు చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు.నిర్మాతగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన కొత్తలో వరుస ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు.

 ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రం హిట్ అవడంతో కొంతమేర కోలుకున్నాడు.అయితే తాజాగా బండ్ల గణేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని సినిమా పరిశ్రమ యొక్క విలువను తెలియజేశాడు.

 Telugu Film Producer Bandla Ganesh Sensational Comments On Director-ఆ దర్శకుడికి సినిమా అంటే గౌరవం లేదు… అందుకే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా ఏ రంగంలోనైనా పని చేస్తే కేవలం డబ్బు మాత్రమే వస్తుందని కానీ సినిమా రంగంలో పని చేస్తే డబ్బుతో పాటు క్రేజ్ మరియు  ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వస్తుందని అంతేకాక మన గురించి ప్రపంచానికి తెలుస్తుందని చెప్పుకొచ్చాడు.అలాగే తాను గబ్బర్ సింగ్ సినిమా తీసిన తర్వాత తన బంధువుల సంబంధించిన ఓ వేడుకకి వెళ్లానని అయితే ఆ వేడుకకి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారని, కానీ కొంతమంది తనతో సెల్ఫీలు దిగడం మరియు ఆటోగ్రాఫ్  తీసుకోవడం వంటివి చేశారని ఆ సమయంలో తనకు చాలా సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.

Telugu @ganeshbandla, Banda Ganesh, Banda Ganesh Comments On Film Director, Film Industry Value, Gabbersingh Movie, Telugu Film Producer, Telugu Film Producer Banda Ganesh Sensational Comments On Director, Tollywood-Movie

కానీ కొంతమంది సినిమా పరిశ్రమకి పెద్దగా విలువ ఇవ్వడం లేదని ఆ మధ్య తాను ఓ టాలీవుడ్ సినిమా దర్శకుడితో పని చేశానని అతడికి సినిమా అంటే బొత్తిగా గౌరవం లేదని అలాంటి వాళ్ళు కూడా సినిమా పరిశ్రమలో ఉన్నారని తెలిపాడు.కానీ ఆ దర్శకుడి పేరు మాత్రం బండ్ల గణేష్ బయట పెట్టలేదు.

ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో బండ్ల గణేష్ కమెడియన్ గా నటించాడు.కాగా ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అయితే బండ్ల గణేష్ కేవలం నిర్మాతగా, నటుడిగా మాత్రమే కాకుండా వ్యాపారాలలో కూడా బాగానే రాణిస్తున్నాడు.కాగా బండ్ల గణేష్ కి ఇద్దరు కొడుకులు ఉన్నారు.ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ తన పెద్ద కొడుకుని వ్యాపార వేత్తను చేస్తానని, అలాగే చిన్న కొడుకుని సినిమా ఇండస్ట్రీలో హీరోగా లేదా నిర్మాతని చేస్తానని తెలిపాడు.

#TeluguFilm #@ganeshbandla #FilmIndustry #TeluguFilm #BandaGanesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు